'సావిత్రి' సౌందర్యలే నాకు ఆదర్శం!
'సావిత్రి, సౌందర్యలే నాకు ఆదర్శం' అంటోంది మలయాళీ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్. ఇటీవల పాత్రియుకేల సమావేశంలో ఆమె మాట్లాడింది. ఈ సందర్భంగా "మీరింత హోమ్లీ పాత్రల్నే ఎంచుకుంటారేంటి?' అని అడగడంతో, 'ఔను, నాకు అలాంటి పాత్రలే ఇష్టం. నేను పుట్టింది, పెరిగింది అలాంటి వాతావరణంలోనే. అందుకే నిండుగా బట్టలేసుకుంటా. పొట్టి దుస్తులతో కనిపించడం నాకిష్టంలేదు. ఒకవేళ అలా నటించాననుకోండి? ఏంటి మీరు మరీ అంత కురచ డ్రెస్‌లు వేసుకుంటున్నారు? అని మళ్ళీ మీరే అడుగుతారు. మీతో వచ్చిన చిక్కే ఇది..' అంటూ చిరుకోపం ప్రదర్శించింది. 'సావిత్రి, సౌందర్యలు కూడా ఇలాగే సంసార పక్షమైన పాత్రలే ధరించారు. అందుకే ఇప్పటికీ వాళ్ళను మనం గుర్తుచేసుకుంటున్నాం. నాకూ వాళ్ళే ఆదర్శం. 'అంటూ తన ఆకాంక్షను వ్యక్తపరిచింది. అందుకే కాబోలు ఈ రోజు విడుదలైన 'అ ఆ ఇ ఈ" చిత్రంలో కూడా చాలా అందంగా సాంప్రదాయబద్దంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











