మగరాయుడు మీరాజాస్మిన్
పేరుకు తగ్గట్టే ఏడు మల్లెలెత్తు సుకుమారి మీరాజాస్మిన్ డ్రీమ్ రోల్ ఏమిటని అడిగిన వారు ఆమె సమాధానం విని ఖంగుతిన్నారు. తనకి ఫైట్స్ చేయడం అన్నా, పోలీస్ వేషం వేయడం అన్నా చాలా ఇష్టమని, కర్తవ్యం సినిమాలో విజయశాంతి పోషించిన పాత్రలాంటిది చేయాలన్నది తన చిరకాల కోరిక అని మనసులో మాట బయటపెట్టింది మీరా. సుకుమారంగా, అమాయకంగా కనిపించే ఆ అమ్మాయి సరదాగా అందేమో అని సందేహపడినప్పుడు - అలాంటిదేం కాదు.. నిజానికి నా చిన్నప్పటి నుంచి నాకు పోలీస్ వేషాలంటేనే ఎక్కువ ఇష్టం అని డౌట్ తీర్చింది. తను ఆడపిల్లనే అయినా చిన్నప్పుడు ఎప్పుడూ మగరాయుడు ఆటలే ఆడేదానినని చెప్పింది. చాలామంది ఆడపిల్లలు ముద్దుముద్దుగా కబుర్లు చెప్పడం, చాక్లెట్లు ఇష్టపడటం, బొమ్మలతో ఆడుకోడం చేస్తుంటారు. కానీ నేను మాత్రం బొమ్మల్ని పక్కన పడేసి.. అబ్బాయిల్తో ఆటలాడేసేదాన్ని. ఎక్కువసార్లు నేను పోలీస్ అంటూ పిల్లల్ని జడిపించేదాన్ని.. అంటూ చెప్పుకుని మురిసిపోయింది. కొన్నిసార్లు మా పిల్లల మధ్య ఫైట్లు కూడా జరిగేవి.. అంటుంది మీరా. విజయశాంతి లేనిలోటు తీర్చలేమని బాధపడే టాలీవుడ్ నిర్మాతలుంటే.. మీరా మాటలు వారికి కొత్త ఉత్సాహాన్నివ్వచ్చు!


Click it and Unblock the Notifications











