For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిబ్రవరిలో పవన్ హీరోయిన్ పెళ్లి

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ చిత్రంలో అదరకొట్టిన మీరా జాస్మిన్ గుర్తుందా..ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ 2014 ఫిబ్రవరిలో పెళ్లాడబోతోంది. వరుడు దుబాయ్‌లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్. త్రివేండ్రంకు చెందిన అనిల్ ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చేశాడు. ఒక మేట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ పెళ్లి ప్రపోజల్ వచ్చిందనీ, మీరా కుటుంబం దీనికి అంగీకరించిందనీ సమాచారం.

    మీరా ఇదివరకు మాండలీన్ శ్రీనివాస్ సోదరుడు రాజేశ్‌తో ప్రేమలో పడింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. కాగా మీరా, అనిల్‌జాన్ పెళ్లి ఫిబ్రవరి 12న త్రివేండ్రంలోని ఎల్.ఎమ్.ఎస్. చర్చిలో జరుగుతుందని వినిపిస్తోంది.

    2004లో మలయాళీ చిత్రం 'పాదమ్ ఒన్ను: ఒరు విలాపమ్'లో ప్రదర్శించిన నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డు పొందిన మీరా తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, గోరింటాకు, మహారథి, ఆఆఇఈ, ఆకాశ రామన్న, మోక్ష వంటి చిత్రాల్లో నటించింది.

    English summary
    Meera Jasmine who impressed all with ‘Bhadra’,’Gudumba Shankar’ and later with ‘Pandem Kodi’ and ‘Yuva’ is getting ready for marriage. Buzz is, she is all set to wed a software engineer on Feb. 12th. Earlier Meera fell in love with a musician. Many during that time spoke about her live- in relationship which even she did not condemn. At that time she even questioned what was wrong in live- in relationship. However now they are shocked about her marriage with a software engineer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X