Don't Miss!
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఫిబ్రవరిలో పవన్ హీరోయిన్ పెళ్లి
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ చిత్రంలో అదరకొట్టిన మీరా జాస్మిన్ గుర్తుందా..ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ 2014 ఫిబ్రవరిలో పెళ్లాడబోతోంది. వరుడు దుబాయ్‌లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్. త్రివేండ్రంకు చెందిన అనిల్ ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చేశాడు. ఒక మేట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఈ పెళ్లి ప్రపోజల్ వచ్చిందనీ, మీరా కుటుంబం దీనికి అంగీకరించిందనీ సమాచారం.
మీరా ఇదివరకు మాండలీన్ శ్రీనివాస్ సోదరుడు రాజేశ్‌తో ప్రేమలో పడింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. కాగా మీరా, అనిల్‌జాన్ పెళ్లి ఫిబ్రవరి 12న త్రివేండ్రంలోని ఎల్.ఎమ్.ఎస్. చర్చిలో జరుగుతుందని వినిపిస్తోంది.
2004లో మలయాళీ చిత్రం 'పాదమ్ ఒన్ను: ఒరు విలాపమ్'లో ప్రదర్శించిన నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డు పొందిన మీరా తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, గోరింటాకు, మహారథి, ఆఆఇఈ, ఆకాశ రామన్న, మోక్ష వంటి చిత్రాల్లో నటించింది.