మీరా జాస్మిన్ 'మోక్ష' రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్ : చాలా కాలం క్రితమే సినిమా పూర్తై,విడుదలకోసం ఎదురుచూస్తున్న మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మోక్ష'. రాజీవ్ మోహన్, దిశాపాండే కీలక పాత్రలు పోషించారు. వచ్చే నెల 6న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాత. . శ్రీకాంత్ వేములపల్లి దర్శకుడు. పి.అమర్‌నాథ్‌రెడ్డి నిర్మాత. విజయ్ కురాకుల స్వరాలు సమకూర్చారు.
ఈ చిత్రంలో మీరా జాస్మిన్ వేంపైర్ గా కనిపించనుందని సమాచారం. ఓ ప్రెంచ్ క్లాసిక్ హర్రర్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ చిత్రమిది. మంత్ర వచ్చిన కొత్తలో మొదలైన చిత్రం ఇది.
దర్శకుడు మాట్లాడుతూ "ఆసక్తికరమైన కథ, ఉత్కంఠను కలిగించే కథనం ఈ చిత్రానికి ప్రధాన బలం. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత వుండే చిత్రమిది' అన్నారు.
హీరోయిన్ మీరా జాస్మిన్ మాట్లాడుతూ" ఇప్పటి వరకు నేను పోషించనటుంటి వైవిధ్యమైన పాత్ర ఇది. హారర్ కథాంశ చిత్రాల్లో ఇదొక వైవిధ్యమైన చిత్రంగా వుంటుంది' అని తెలిపారు.
మీరా జాస్మిన్ నటిస్తున్న తొలి థ్రిల్లర్ చిత్రమిదినీ, ఇందులో ఆమె పాత్ర ఎంతో కీలకం అనీ, గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథ ఇది నిర్మాత చెప్తున్నారు. నాజర్, రాహుల్ దేవ్, సన, వహిదా, కాదల్ సుకుమార్, విజయ్ భాస్కర్, సుమన్ శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్.పి, సమర్పణ: శ్రీమతి పి.హిమబిందు, నిర్మాణం: అమర్ నాథన్ మూవీస్.


Click it and Unblock the Notifications












