భయం... భయంగా మీరాజాస్మిన్
మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మోక్ష' విడుదలకు రెడీ అయింది. బ్లాక్ అండ్ వైట్ చిత్రంతో పరిచయమైన శ్రీకాంత్ వేములపల్లి దర్శకుడు. ఈ సందర్భంగా నిర్మాత ప్రొద్దుటూరి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ''నేను భయపడను అనుకొనే ప్రతి ఒక్కరికీ మనసులో ఏదో మూలన చిన్నపాటి ఆందోళన, కంగారు ఉంటాయి. అయితే అవి ఎందుకున్నాయి అనేది ఎవరూ చెప్పలేరు. మా కథలో ఓ యువతి తరచూ భయపడుతూ, ఆందోళన చెందుతూ ఉంటుంది. ఎందుకు? అనేది తెర మీదే చూడాలి. ప్రతి సన్నివేశం ఉత్కంఠగా సాగుతుందని అన్నారు. ఈ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
'మోక్ష' లో మీరా జాస్మిన్ వేంపైర్ గా కనిపించనుందని సమాచారం. ఓ ప్రెంచ్ క్లాసిక్ హర్రర్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ చిత్రమిది. రాజీవ్ మోహన్, దిశపాండే ఇందులో జంటగా నటించారు. శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వంలో పి.అమర్ నాథ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీరా జాస్మిన్ నటిస్తున్న తొలి థ్రిల్లర్ చిత్రమిదినీ, ఇందులో ఆమె పాత్ర ఎంతో కీలకం అనీ, గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కథ ఇది నిర్మాత చెప్తున్నారు. నాజర్, రాహుల్ దేవ్, సన, వహిదా, కాదల్ సుకుమార్, విజయ్ భాస్కర్, సుమన్ శెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్.పి, సమర్పణ: శ్రీమతి పి.హిమబిందు, నిర్మాణం: అమర్ నాథన్ మూవీస్.


Click it and Unblock the Notifications











