మీరా జాస్మిన్ కి అంత సీనుందా అంటున్నారు?
ఎన్నో రోజులు క్రితం పూర్తయినా విడుదలకు నోచుకుని మీరా జాస్మిన్ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అవుతోంది. మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'మోక్ష' విడుదలకు సిద్ధమైంది. 'బ్లాక్ అండ్ వైట్' చిత్ర దర్శకుడిగా శ్రీకాంత్ వేములపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ హర్రర్. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...'మీరా జాస్మిన్ తొలిసారిగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. పూర్తిస్థాయి హారర్ చిత్రమిది. అన్ని భావోద్వేగాలు ఉంటాయి. ఓ అమ్మాయి జీవితంలో జరిగే కొన్ని విచిత్రమైన సంఘటనల సమాహారమే ఈ చిత్రకథాంశం. ప్రతి సన్నివేశాం ఆసక్తికరంగా ఉంటూ, ప్రేక్షకులకు ఎంతో థ్రిల్లింగ్‌ను కలిగిస్తుంది. ఈనెల చివరివారంలో పాటలను విడుదల చేసి ఆగస్టు రెండోవారంలో చిత్రాన్ని విడుదల చెయ్యాడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు. ఇక చిత్రంలో మీరా జాస్మిన్ వేంపైర్ గా కనిపించనుందని సమాచారం. ఓ ప్రెంచ్ క్లాసిక్ హర్రర్ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇంతకీ హోమ్లీ హీరోయిన్ గా కనపడే మీరా...హర్రర్ లో కనపడి భయపెట్టగలదా అనే సందేహం అంతటా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











