మళ్లీ వార్తల్లోకి మీరా జాస్మిన్ వివాహం

By Srikanya

హైదరాబాద్ : గుడుంబా శంకర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఆ మధ్యన నటనకు బై చెప్పి ఆ మధ్యన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చర్చిలో జరిగిన ఆమె వివాహాన్ని కేరళ ప్రభుత్వ కార్పోరేషన్ అథికారులు నమోదు చేయలేదు. కారణం...ఆమెను వివాహం చేసుకున్న అనిల్ జాన్ ది రెండో వివాహం అన్న సందేహమే. మొదటి నుంచి మీరా జాస్మిన్..అతని కి రెండో భార్య అని అంతటా వినిపించింది. అదే విషయాన్ని అనుమానిస్తూ ఇప్పుడు గవర్నమెంట్ సైతం వీరి వివాహానికి చట్టబద్దత కల్పించటానికి నిరాకరించింది.

ఈ విషయమై అక్కడ రిజిస్ట్రార్ ఆఫీసర్ ఒకరు మాట్లాడుతూ... ఇటీవల మీరాజాస్మిన్, అనిల్‌జాన్ తమ వివాహ నమోదు సమస్య గురించి అడగడానికి తమ కార్యాలయానికి వచ్చారని తెలిపారు. అలాగే వివాహం జరిగిన నలభై ఐదు రోజుల తరువాత వివాహం నమోదు చేయడానికి వచ్చిన వారిని విచారించడం అన్నది సాధారణ విషయం అన్నారు.

అలాగే... భర్తతో కలిసి దుబాయ్‌లో నివశిస్తున్న ఆమెను వివాహ నమోదు గురించి ప్రశ్నించగా ఆమె ఎలాంటి బదులు ఇవ్వలేదని తెలిపారు. ఈ కారణంగానే వారి వివాహాన్ని చట్టబద్దంగా నమోదు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Meera Jasmine’s marriage yet to be registered officially

ఆమెను పెళ్లి చేసుకున్న అతను దుబాయ్‌లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్. త్రివేండ్రంకు చెందిన అనిల్ ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ చేశాడు. ఒక మేట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ పెళ్లి ప్రపోజల్ వచ్చిందనీ, మీరా కుటుంబం దీనికి అంగీకరించిందనీ చెప్పుకున్నారు. అయితే ఆ వివాహ సమయంలో అనీల్ జాన్ పోలీసుల రక్షణ కోరాడు. అతను అంతకుముందు బెంగళురుకు చెందిన ఒక యువతితో పెళ్లికి సిద్దం అయ్యారని, అయితే కొన్ని కారణాల వివాహం అయ్యిందని వారి కుటుంబసభ్యులే ఆ పెళ్లిని ఆపారని వార్తలు వచ్చాయి.

మీరా ఇదివరకు మాండలీన్ శ్రీనివాస్ సోదరుడు రాజేశ్‌తో ప్రేమలో పడింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. కాగా మీరా, అనిల్‌జాన్ పెళ్లి ఫిబ్రవరి 12న త్రివేండ్రంలోని ఎల్.ఎమ్.ఎస్. చర్చిలో జరుగుతుందని జరిగింది.

2004లో మలయాళీ చిత్రం 'పాదమ్ ఒన్ను: ఒరు విలాపమ్'లో ప్రదర్శించిన నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డు పొందిన మీరా తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, గోరింటాకు, మహారథి, ఆఆఇఈ, ఆకాశ రామన్న, మోక్ష వంటి చిత్రాల్లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X