మీరా జాస్మిన్ తీరని కల..
పేరుకు తగ్గట్టే.. మల్లెతీగ.. మీరా జాస్మిన్. దక్షిణాది చిత్రాలలో అడుగుపెడుతూనే మళయాల, తమిళ, తెలుగు చిత్రసీమలో వరుసగా చిత్రాలు చేస్తూ దక్షిణాదిన అగ్రశ్రేణి తారామణుల్లో స్థానం సంపాదించుకున్న మీరా జాస్మిన్‌కు తీరని కల ఒకటుంది.
2004లో మళయాల చిత్రం పదం ఒన్ను ఒరు విలాపం చిత్రంలో అద్భుత నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న మీరా జాస్మిన్ తనకు అందంతో పాటు అభినయం కూడా ఉందని చాటింది. అప్పటి నుండి కెరీర్‌లో ఎదురులేని మీరా జాస్మిన్‌ను అనేక పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవలే పందెం కోడి చిత్రంలో అద్భుత నటన ప్రదర్శించి ఆ చిత్రం తమిళంలోనూ, తెలుగులోనూ విజయవంతం కావడంలో కీలక భూమిక పోషించిన మీరా జాస్మిన్ ప్రస్తుతం బాలకృష్ణ సరసన శ్రీలలిత కళాంజలి ప్రొడక్షన్స్ చిత్రంలో నటిస్తోంది.
ఎన్ని పాత్రల్లో నటిస్తున్నా ఆమె దృష్టి మాత్రం డైరెక్షన్ మీదనే ఉంది. ఛాన్స్ దొరికితే.. ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలని మీరా జాస్మిన్ ఊవిళ్లూరుతోంది. మంచి స్క్రిప్టు దొరికితే వెంటనే డైరెక్షన్‌లోకి దూకేస్తాను అంటోంది మీరా. నటిగా ఇప్పటికే అసమాన ప్రతిభని కనబర్చిన మీరా డైరెక్షన్‌లో కూడా ఉత్తమ దర్శకురాలిగా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలెంట్ ఉన్నవారు ఎందులోనైనా రాణిస్తారని మీరా జాస్మిన్ మరోమారు రుజువు చేసే ప్రయత్నంలో ఉంది.


Click it and Unblock the Notifications