వైన్ తాగుతూ రొమాంటిక్‌గా: మీరా జాస్మిన్ రిసెప్షన్(ఫోటోలు)
హైదరాబాద్: నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ మీరా జాస్మిన్ వివాహం అనిల్ జాన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తో తిరువనంతపురంలో బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తంతు చర్చిలో కాస్త సింపుల్‌గా జరిగినా.... వివాహం అనంతరం వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరుపుకున్నారు ఈ కొత్త జంట.
వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో మీరా జాస్మిన్, అనిల్ జాన్ ప్రత్యేకంగా తయారు చేసిన వెడ్డింగ్ కేక్‌ను కట్ చేసారు. రొమాంటిక్ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మీరా జాస్మిన్-అనిల్ జాన్ వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది.
మీరా జాస్మిన్, అనిల్ జాన్ టైటస్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో......

మీరా జాస్మిన్-అనిల్ జాన్
లేత గులాబీ రంగు పట్టు చీరలో అందంగా మెరిసి పోతున్న హీరోయిన్ మీరా జాస్మిన్, పక్కనే ఆమె భర్త అనిల్ జాన్.

సాంప్రదాయ బద్దంగా
క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగిన ఈ కార్యక్రమంలో తన భార్య మీరా జాస్మిన్‌కు గొడుగు పట్టి తీసుకొస్తున్న అనిల్ జాన్.

కేక్ కట్ చేస్తూ...
వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన వెడ్డింగ్ కేక్‌ను కట్ చేస్తున్న మీరా జాస్మిన్, అనిల్ జాన్.

ముద్దుల పెళ్లానికి మురిపెంగా..
ముద్దుల పెళ్లానికి మురిపెంగా కేకు ముక్కను తినిపిస్తున్న అనిల్ జాన్. ఎంతో రొమాంటిక్‌గా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమం జరిగింది.

వైన్‌తో చీర్స్...
వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో అనిల్ జాన్, మీరా జాస్మిన్ ఎంతో సంతోషంగా కనిపించారు. వైన్‌తో చీర్స్ అంటూ ఇలా అతిథులను విందు ఏర్పాట్లు చేసారు.


Click it and Unblock the Notifications











