»   » రియల్ ప్రభాస్, డూప్లికేట్ ప్రభాస్ కలిసి ఇలా... (ఫోటో)

రియల్ ప్రభాస్, డూప్లికేట్ ప్రభాస్ కలిసి ఇలా... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో కొన్నిప్రమాదకరమైన స్టంట్స్ చేసేపుడు హీరోలను పోలి ఉండే డూప్ లను ఉపయోగించడం తెలిసిందే. బాహుబలి సినిమాలో కూడా ప్రభాస్ చేయాలన్ని కొన్ని ప్రమాద కరమైన స్టంట్స్ డూప్ తో చేయించారు. ప్రభాస్ వెనక ఉన్న ఆ డూప్ ఆర్టిస్ట్ పేరు కిరణ్ రాజ్. అచ్చ ప్రభాస్ మాదిరిగానే హైటు, వెయిట్, హెయిర్, ఫిజిక్ కలిగి ఉన్న అతను బాహుబలి సినిమాలో ఎంతో కీలకంగా మారాడు.

కిరణ్ రాజ్ తో కలిసి ప్రభాస్ ఫోటోలకు ఫోజు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. ఈ సినిమాకే కాదు.... గతంలో ప్రభాస్ చేసిన పలు చిత్రాల్లో డూపుగా చేసాడు. అయితే రాజమౌళితో కలిసి బాహుబలి చిత్రంలో ప్రభాస్ కు డూప్ గా చేయడం లైఫ్ టైమ్ ఆపర్య్చునిటీ అని అంటున్నాడు కిరణ్ రాజ్.


Meet The Duplicate Prabhas Behind Prabhas

బాహుబలి సినిమా విషయానికొస్తే...
‘బాహుబలి' చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగాన్ని ‘బాహుబలి ది బిగినింగ్' పేరుతో విడుదల చేయబోతున్నారు. కొన్ని నెలల గ్యాప్ తర్వాత బాహుబలి పార్ట్-2 విడుదల చేయనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, ప్రభాకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


ఇండియన్ సినిమా చరిత్రలో ‘బాహుబలి' ఓ గొప్ప చిత్రం కాబోతుంది. ‘బాహుబలి' పార్ట్-1 షూటింగ్ పూర్తయిందని రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. సినిమా నిడివి 2.32 నిమిషాలు ఉంటుందని రాజమౌళి స్పష్టం చేసారు. అదే విధంగా బాహుబలి పార్ట్-2 షూటింగ్ 70 శాతం పూర్తయిందని తెలిపారు.

English summary
To perform critical stunts, Heros either look to rope-support or will rope in a body-double. Even our hunk hero Prabhas, the Baahubali, has such a dupe for him and his name is Kiran Raj.
Please Wait while comments are loading...