twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలవుదామని వచ్చి విలన్స్ అయ్యారు(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : హీరోలకు ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత విలన్ పాత్రలకు ఉన్న సినిమాలే బాగా ఆడుతూంటాయి. కాకపోతే కొన్ని సంవత్సరాల క్రితం వరకు విలన్‌ అంటే బోడి గుండుతో, బానలాంటి పొట్టతో, క్రూరమైన చూపులతో, ఎర్రటి జీరలున్న కళ్లతో ప్రేక్షకులకు భయం పుట్టించేలా ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలు పాలు, పక్షులు నీళ్లు తాగవు వీరి పేరు చెబితే అన్నట్లుగా ఉండేది వారి అవతారం.

    హిందీ చిత్రాల్లో విలన్‌ అనగానే మనకు ప్రాణ్‌, అమ్రిష్‌పురి, శక్తి కపూర్‌, అంజద్‌ ఖాన్‌, డేనీ, రంజిత్‌ సింగ్‌ వంటి వాళ్లు గుర్తుకు వస్తారు. కానీ ప్రస్తుతం ఆ ట్రెండు మారిపోయింది. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లోని విలన్‌ పాత్రలను పోషిస్తున్న వారిని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

    అందమైన ఆకారంతో, ఆరు పలకల దేహంతో, నిర్ధిష్ట కొలతల్లో ఇమిడిపోయే శరీర సౌష్టవంతో హీరోలకు ధీటుగా ఉంటున్నారు ఈ విలన్లు. ఒక్కొక్కసారి హీరో కంటే మరింత దేహ దారుఢ్యంతో, అందంగానూ కూడా ఉంటున్నారు. ఈ యువ నటులు హీరోలుగా వెండి తెరను ఏలాలని ఈ రంగంలో అడుగుపెట్టినప్పటికీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నంలోనే విలన్‌లుగా అవతారం ఎత్తారు కొందరు.

    బాలీవుడ్ లో సోనూ సూద్‌, ఫ్రెడ్డీ దారూవాలా, నికితిన్‌ ధీర్‌, హరూన్‌ ఖాజీ, విక్రమ్‌ సింగ్‌ వంటి వారున్నారు. వీరందరూ సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌తో పాటు వర్ధమాన నటుడు టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి నటించడం గమనార్హం.

    సోనూ సూద్‌

    సోనూ సూద్‌

    ''నిన్ను వదల బొమ్మాళీ''...అంటూ 'అరుంధతి' చిత్రంతోపాటు తన భీకర రూపంతో ప్రేక్షకులను కూడా భయపెట్టిన సోనూ సూద్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితుడే. ఇతను సల్మాన్‌ఖాన్‌తో పాటు పోటీ పడి నటించిన 'దబంగ్‌' చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇదే చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా ప్రస్తుతం అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరన్న విషయం తెలిసిందే. అంద విహీనంగా కనిపించే ప్రతి కథానాయకులకు కాలం చెల్లిందని, దేహ దారుఢ్యంతోపాటు సుందరమైన రూపం ప్రస్తుతం వీరి సొంతమన్నది సోనూ సూద్‌ అభిప్రాయం. ఈ ట్రెండు హాలీవుడ్‌ నుంచి మనకు దిగుమతి అయిందని చెప్తారు హీరోలాగా కనిపించే ఈ విలన్‌. ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాల్లో విలన్‌ పాత్రలు వినోదాత్మకంగా, రొమాంటిక్‌గా ఉంటున్నాయంటారీయన.

    విక్రమ్‌ సింగ్‌

    విక్రమ్‌ సింగ్‌

    అల్లు అర్జున్‌ హీరోగా నటించిన 'పరుగు' చిత్రాన్ని 'హీరోపంతి' పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. ప్రముఖ బాలీవుడ్‌ హీరో జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ ఈ చిత్రంతో హీరోగా తెరంగెేట్రం చేశారు. దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలైన కృతి సనన్‌ దీనిలో హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో మెరిశారు విక్రమ్‌ సింగ్‌. ప్రస్తుత విలన్‌ ఎంతో అందంగా కనిపిస్తూ చెడ్డ లక్షణాలున్న ఆధునిక రావణుడి అవతారంలో కనిస్తాడంటాడీయన. మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తెరకెక్కిస్తున్న చిత్రాల్లో హీరోకు ధీటుగా విలన్‌ పాత్ర కూడా ఉంటుందని, ఒకే చిత్రంలో ఇద్దరు హీరోలు ప్రేక్షకులకు కనువిందు చేసే విధంగా దర్శకుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్నది విక్రమ్‌ సింగ్‌ ఉద్దేశం.

    హరూన్‌ ఖాజీ

    హరూన్‌ ఖాజీ

    చిరంజీవి హీరోగా నటించిన 'స్టాలిన్‌' చిత్రాన్ని సల్మాన్‌ ఖాన్‌ హీరోగా దర్శకుడు ఎ. ఆర్‌ మురుగ దాసు 'జై హో' పేరుతో తెరకెక్కించారు. దీనిలో సల్లూ భాయ్‌కి ధీటుగా విలన్‌ పాత్రలో నటించడానికి హరూన్‌ ఖాజీని ఎంపిక చేశారు. సల్మాన్‌ ఖాన్‌ రూపానికి సరిపోయే విధంగా విలన్‌ ఉండాలని ఆశించిన మురుగదాసు హరూన్‌కు విలన్‌ క్యారెక్టర్‌ ఇచ్చాడు ఈ సినిమాలో. ప్రతిసారి 'రాముడు మంచి బాలుడు' అన్న చందంగా ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారని గ్యారంటీలేదని, అందంగా కనిపిస్తూ కాస్త తుంటరి స్వభావం ఉండే చెడ్డ అబ్బాయిల వైపు కూడా మొగ్గుచూపుతారన్నది హరూన్‌ అభిప్రాయం. అందుకే తనలాంటి విలన్‌లకు చిత్రాల్లో స్థ్ధానం లభిస్తుందంటాడీయన.

    ఫ్రెడ్డీ దారూవాలా

    ఫ్రెడ్డీ దారూవాలా

    తమిళ చిత్రం 'తుపాకి'ని హిందీలో 'హాలీడే: ఏ సోల్జర్‌ ఈజ్‌ నెవర్‌ ఆఫ్‌ డ్యూటీ' పేరుతో రీమేక్‌ చేశారు ప్రముఖ దర్శకుడు ఎ. ఆర్‌. మురుగదాసు. దీనిలో హీరో అక్షయ్‌ కుమార్‌తో పోటీ పడి విలన్‌ పాత్రలో మెరిశాడు ఫ్రెడ్డీ దారూవాలా. పాత్రలో సత్తా ఉంటే తనలాంటి వర్ధమాన నటుడిని ప్రేక్షకులు విలన్‌ పాత్రలో కూడా ఆదరిస్తారన్నది ఇతని అభిప్రాయం.

    నికితిన్‌ ధీర్‌

    నికితిన్‌ ధీర్‌

    రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వచ్చి 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలో 'తంగవేలు' పాత్రను పోషించిన నికితిన్‌ ధీర్‌ను ఎవరూ మర్చిపోలేరు. బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కూడా తలెత్తి చూడాల్సినంత పొడవు, భారీ శరీరంతో ప్రేక్షకులను కూడా భయపెట్టాడీ విలన్‌. పాత సినిమాల్లోని హీరోల స్థ్ధానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయినప్పటికీ ప్రస్తుతం దర్శకులు విలన్‌ను తెరపై చూపించే విధానం మారిందంటాడీ నటుడు. అందమైన రూపంలోనూ చెడు దాగి ఉంటుందని చెప్పడానికి ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లోని విలన్‌లే ఉదాహరణ అంటారీయన. 'జోధా-అక్బర్‌' చిత్రంతో విలన్‌గా సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన 'మిషన్‌ ఇస్తన్‌బుల్‌, 'రెడీ' వంటి చిత్రాల్లోనూ నటించారు.

    English summary
    what is interesting is that today, we have some of our sexiest and the most unconventional people playing villain.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X