మెగా, నందమూరి మల్టి స్టారర్.. మైండ్ బ్లాకింగ్ యూనివర్స్ లోడింగ్!
ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి పలు క్రేజ్ మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నా సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడిప్పుడే ఇండియన్ సినిమా నుంచి కూడా పలు సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ కూడా బాగా ఊపందుకుంది. కోలీవుడ్ నుంచి లోకేష్ కనగరాజ్ చేసిన ప్రయోగంతో ఈ సినిమా ట్రెండ్ బాగా పాపులర్ అవ్వగా నెక్స్ట్ హిందీ నుంచి ఓ స్పై యూనివర్స్ అనౌన్స్ చేశారు.
అయితే మన తెలుగు నుంచే మరో రెండు భారీ సినిమాటిక్ యూనివర్స్ లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తన "హనుమాన్" తోని ఇప్పుడు రీసెంట్ గా మరో దర్శకుడు నాగ్ అశ్విన్ తన "కల్కి" యూనివర్స్ తో ఖరారు చేశారు. దీంతో టాలీవుడ్ నుంచి రెండు సినిమాటిక్ యూనివర్స్ లు పడబోతుండగా ఇప్పుడు మూడోది యాడ్ అవ్వబోతుందా అది కూడా మెగా అండ్ నందమూరి కాంబినేషన్ లో అంటే ఆ ఊహ ఎలా ఉంటుంది.?

ఇప్పటికే RRR అనే సినిమాతో రాజమౌళి ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ లతో చేస్తేనే ఇండస్ట్రీ షేక్ అయ్యింది. మరి ఒకసారి అసాధ్యం అనుకున్న ఈ కాంబినేషన్ సుసాధ్యం అయ్యింది. కానీ ఈసారి మళ్ళీ అయ్యే అవకాశం ఉందా అన్నట్టు అనిపిస్తుంది. కాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వశిష్ఠతో భారీ సినిమా "విశ్వంభర" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా దీనికి ముందు ఈ దర్శకుడు "బింబిసార" అనే సినిమా చేసాడు. అయితే ఇంట్రెస్టింగ్ గా రెండూ కూడా ఫాంటసీ జానర్ సినిమాలే కావడం గమనార్హం. అయితే ఈ రెండు సినిమాలకి ఒక అంతర్గత కనెక్షన్ ఉంటుందా అనే ప్రశ్న మునుపెన్నడూ రాలేదు కానీ లేటెస్ట్ గా వశిష్ఠ తన ఎక్స్ ఖాతాలో అప్డేట్ చేసిన ఫోటో చూస్తే రెండు యూనివర్స్ లు కలవబోతున్నాయా అనే క్రేజీ టాక్ మొదలైంది.

కాగా రెండు సినిమాల టైటిల్స్ కి మధ్యలో ఒక వార్మ్ హోల్ లాంటిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనితో రెండు సినిమాల యూనివర్స్ లు కలుస్తున్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ నిజం అయితే మాత్రం చిరు అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ లు కలుస్తారా అని అనుకోవచ్చు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో అనేది కాలమే నిర్ణయించాలి. ఒకవేళ నిజం అయితే మాత్రం మన తెలుగు సినిమా నుంచి ఇది ముచ్చటగా మూడో సినిమాటిక్ యూనివర్స్ అని కూడా చెప్పాలి.
కాగా ఇప్పుడు ఆల్రెడీ విశ్వంభర షూటింగ్ తుది దశకి చేరుకుంటుండగా వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మరో యువ హీరోయిన్స్ ఆశికా రంగనాథ్, సురభి పురాణిక్ లు కూడా నటిస్తున్నారు. కాగా రష్మిక కూడా ఉందని మరో టాక్ రాగా, యూవీ క్రియేషన్స్ వారు మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











