మెగా ఫ్యాన్స్ ‘ఆల్ టైం రికార్డ్’!
నెల్లూరు: మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు, రక్తదానం చేయడం కొన్ని సంవత్సరాలుగా అభిమానుల ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ఈ రోజు చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు రక్తదానం, సేవా కార్యక్రమాలు చేపట్టారు.
చిరంజీవికి సంబంధించిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ నుంచి అందిన సమాచారం ప్రకారం నెల్లూరులో ఈ రోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎన్నడూ లేని విధంగా 2955 యూనిట్ల రక్తాన్ని సేకరించారని తెలుస్తోంది. ఇది బ్లడ్ డొనేషన్లో ఆల్ టైం రికార్డ్ అని అంటున్నారు.
కాగా...చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని అల్లు అర్జున్ దంపతులు హైదరాబాద్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్టు వద్ద కేక్ కటింగ్ చేసారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు రక్తదానం చేసారు. రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ స్వామినాయుడు తదితరులు రక్తదానంలో పాల్గొన్నారు.
chiranjeevi pawan kalyan ram charan teja vv vinayak చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ తేజ్ వివి వినాయిక్


Click it and Unblock the Notifications
