ఎవడో డబ్బులిస్తాడని చూడలేదు, అలా అంటే అబద్దమే, కొంపలు మునగవ్: ఓటమిపై నాగబాబు

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక... రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన మెగాబ్రదర్ నాగబాబుకు సైతం ఓటమి తప్పలేదు.

ఓటమితో కృంగుబాటులో ఉన్న పార్టీ శ్రేణులు, జనసైనికులు, వీర మహిళల్లో ధైర్యం నింపేందుకు ఫలితాల తర్వాత నాగబాబు తొలిసారి స్పందించారు. నా ఛానల్ నా ఇష్టం ద్వారా రియాక్ట్ అవుతూ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వైఎస్ జగన్‌కు కంగ్రాట్స్ చెప్పారు.

జగన్ గారికి కంగ్రాట్స్

జగన్ గారికి కంగ్రాట్స్

ఏపీ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో నెగ్గింది. దాదాపుగా ప్రతి పక్షం అనేది కూడా లేకుండా చేసేంత భారీ విజయం ఆ పార్టీ సొంతమైంది. ఈ సందర్భంగా జగన్ గారికి కంగ్రాట్స్ చెబుతున్నాం. ఆయన భాగా పాలించాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ తరుపున మా సహకారం ఎప్పుడూ ఉంటుందని నాగబాబు తెలిపారు.

ప్రజలకు మీరు రుణపడి ఉన్నారు

ప్రజలకు మీరు రుణపడి ఉన్నారు

ఇంత మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలకు జగన్ గారు రుణపడి ఉన్నారనుకుంటున్నాం. మీ నవరత్నాలు కాన్సెప్టును, ప్రజలకు ఇచ్చిన హామీలను ఐదేళ్లలో తప్పకుండా నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాం. మీరు నిలబెట్టుకునేలా.. మేము కూడా మా ప్రయత్నం చేస్తామని నాగబాబు వ్యాఖ్యానించారు.

లక్షల మంది ప్రజలు క్లీన్ పాలిటిక్స్ మీద ఇష్టంగా ఉన్నారు

లక్షల మంది ప్రజలు క్లీన్ పాలిటిక్స్ మీద ఇష్టంగా ఉన్నారు

జనసైనికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. క్లీన్ పాలిటిక్స్ అనే కాన్సెప్టుతో ముందుకు వచ్చాం. ప్రజలకు డబ్బులు పంచకుండా ముందుకు రాగలిగాం. మనకంటూ కొన్ని లక్షల ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి లక్షలాది మంది ప్రజలు క్లీన్ పాలిటిక్స్ మీద ఇష్టంగా ఉన్నారని స్పష్టమవుతోంది. వారు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.

డబ్బులు ఎవడిస్తాడని చూడలేదు

డబ్బులు ఎవడిస్తాడని చూడలేదు

మార్పు కోరుకునే ప్రజలందరికీ జనసేన తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డబ్బుకోసం ఆశించకుండా, డబ్బులు ఎవడిస్తాడని చూడకుండా కేవలం పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఒక మంచి మార్పు తీసుకొస్తాడనే నమ్మకంతో మీరంతా ఓటు వేశారని నాగబాబు వ్యాఖ్యానించారు.

నైతికంగా మాత్రం మనం గెలిచాం

నైతికంగా మాత్రం మనం గెలిచాం

జనసేన గెలవలేక పోవచ్చు, నైతికంగా మాత్రం మనం గెలిచాం. తప్పకుండా ఇంకా మంచి మార్పు తీసుకొద్దాం. జనసైనికులు, వీర మహిళలు ఈ యుద్ధాన్ని ముందుండి నడిపించారు. ప్రతి జనసైనికుడు, వీర మహిళ... ఈ ఫలితంతో చాలా భావోద్వేగానికి గురయ్యారని నాగబాబు గుర్తు చేసుకున్నారు.

బాధపడటం లేదు అని అనడం అబద్దమే అవుతుంది

బాధపడటం లేదు అని అనడం అబద్దమే అవుతుంది

జనసేన ఓడిపోయినందుకు బాధపడటం లేదు అని అనడం అబద్దమే అవుతుంది. బాధపడ్డాం.. అయితే అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇది తాత్కాలికమే... డోంట్ వర్రీ.. మనం ఇలాగే మన సర్వీస్ కొనసాగిద్దాం. తప్పకుండా ఇంకా ముందుకు వెళ్లి మంచిగా ప్రజాసేవ చేద్దామని తెలిపారు.

రిలాక్స్ అవ్వండి.. ఏం కొంపలు మునగవ్

ఒక నెలరోజులు రిలాక్స్ అవ్వండి, ఏం కొంపలు మునగవ్. నెల, రెండు నెలల పాటు హ్యాపీగా మీ కుటుంబాలతో ఎంజాయ్ చేయండి. ఒత్తిడిని బాడీలో నుంచి తీసేయండి. ఈలోగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ కార్యాచరణ రూపొందిస్తారు. దాని బట్టి మనం ముందుకు వెళదామని నాగబాబు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X