బన్నీకి అపుడు తెలివితేటల్లేవు, కళ్యాణ్ బాబుపై నీచరాజకీయాలు: నాగబాబు ఎమోషనల్ స్పీచ్

By Bojja Kumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ఆడియో ఫంక్షన్ మిలటరీ మాధవరంలో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగబాబు బన్నీ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గురించి, అన్నయ్య చిరంజీవి గురించి కూడా ప్రస్తావించారు.

Recommended Video

Allu Arjun Aggressive Speech At Naa Peru Surya Audio Launch
బన్నీని ఆశీర్వదించండి

బన్నీని ఆశీర్వదించండి

మిలటరీ మాధవరం... ఇది ఎంతో గొప్ప ఊరు. ప్రతి ఇంటి నుండి ఒక సైనికుడు ఇక్కడి నుండి వెళ్లాడు. హాట్సాఫ్. మేము ఈ ఊరు వచ్చి మా సినిమాకు సంబంధించిన మొదటి కార్యక్రమం చేయడం ఆనందంగా ఉంది. సైనికుడి నేపథ్యంలో మా సినిమా వస్తుంది. ఇక్కడ ఉన్న సైనిక కుటుంబాల పెద్దవాళ్ల ఆశీర్వాదం కోసం మా బన్నీ వచ్చాడు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని అందరూ అతన్ని ఆశీర్వదించండి.... అని నాగబాబు కోరారు.

బన్నీకి పెద్దగా తెలివితేటలు ఉండేవి కాదు, వాళ్ల నాన్న దిగులు పడేవారు

బన్నీకి పెద్దగా తెలివితేటలు ఉండేవి కాదు, వాళ్ల నాన్న దిగులు పడేవారు

బన్నీ మా కళ్లముందు పుట్టి పెరిగిన పిల్లవాడు. ప్యూర్ సోల్. కల్లా కపటం, కల్మషం ఇంత కూడా తెలియదు. అందమైన మనసు. బన్నీ గురించి ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మాట అరవింద్ గారు, నేను చాలా కాలం క్రితం మాట్లాడుకున్నాం. ఇంట్లో బన్నీ కంటే పెద్దవాడు ఒకడు, చిన్న వాడు ఒకడు ఉన్నాడు. బన్నీ చాలా సాఫ్ట్. ఉషారుగా ఉంటాడే తప్ప ఎక్కువ తెలివి తేటలతో మాట్లాడేవాడు కాదు. బన్నీ అపుడు నాలుగో తరగతో, ఐదో తరగతో చదువుతున్నాడు. అపుడు మద్రాసులో పెద్దస్తంబాల ఇంట్లో ఉండేవారు. అపుడు అరవింద్ గారు ఓ మాట అన్నారు. పెద్దోడు, చిన్నోడు బానే ఉంటారయ్యా.. నాకు నమ్మకం ఉంది. వీడే అమాయకుడు వీడు ఎలానో ఏంటో అని దిగులు పడేవారు.... అని నాగబాబు తెలిపారు.

బన్నీ మంచోడు కాబట్టే ఈ స్థాయి

బన్నీ మంచోడు కాబట్టే ఈ స్థాయి

అపుడు అరవింద్ గారితో ఒకటే అన్నాను. వీడు మంచోడు, అమాయకుడు మీరు ఎవరూ ఊహించని ఎత్తుకు వెళతాడని చెప్పాను. అపుడు నేను ఎందుకు చెప్పానో తెలియదు. ఒక మనిషి ఎంత తెలివితేటలు కలిగినోడు, ఎంత విద్వత్తు కలిగినోడు, ఎంత గొప్పవాడో కాదు... ఎంత మంచి వాడు? ఎంత నిజాయితీ గలవాడు? అది ఉన్నవాడు టాప్ రేంజికి ఎదగలడు. అందుకు ఉదాహరణ బన్నీ.... అని నాగబాబు తెలిపారు.

అన్నయ్య మాకు జీవితాన్ని ఇచ్చారు

అన్నయ్య మాకు జీవితాన్ని ఇచ్చారు

మెగాస్టార్ చిరంజీవిగారు...మా అందరికీ జీవితాన్ని ఇచ్చిన మా అన్నయ్య. నేనుగానీ, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కానీ, బన్నీ కానీ, రామ్ చరణ్, తేజ్, నిహారిక, అరవింద్ అందరికీ లైఫ్ ఇచ్చిన వ్యక్తి . ఆయన పేరు తలుచుకోకుండా మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరుగదు. మాకు ఈ గ్రేట్ లైఫ్ ఇచ్చినందుకు అన్నయ్యకు థాంక్స్. నీకు కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఏమీ చేయలేం మేమంతా.... అని నాగబాబు వ్యాఖ్యానించారు.

కళ్యాణ్ బాబు మీద నీచరాజకీయాలు

కళ్యాణ్ బాబు మీద నీచరాజకీయాలు

నా అన్నయ్య తర్వాత నా తమ్ముడు నాకు ఎంతో గొప్ప. సినిమా ఇండస్ట్రీలో నెం.1 పొజిషన్లో ఉండి కోట్ల రూపాయల సంపాదన కూడా తృణ ప్రాయంగా వదిలేసి నిస్వార్థంగా వదిలేసి ముందుకు వెళుతున్నాడు. ఎన్నో కుతంత్రాలు, ఎన్నో కుయుక్తులు, నీచమైన రాజకీయాలు మా మీద చేస్తున్నారు. కళ్యాణ్ బాబు లాంటి నిజాయితీ పరులు వస్తే వాళ్ల వేషాలు సాగవు. మీ అందరి కోసం, మీ అందరి బాగు కోసం, తనకున్న భవిష్యత్తును వదిలేసుకుని మీ ముందుకు వచ్చాడు. అతడు రాకూడదని కోరుకున్న వ్యక్తులు, పార్టీలు రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి, ఏమీ చేయలేక కుటుంబాలను ఇష్టమైనట్లు దుర్భాషలాడించి, నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు.

ఒక్కొక్కడికి ఉంటదిక.....

ఒక్కొక్కడికి ఉంటదిక.....

మా తమ్ముడు వీళ్లందరి దుమ్ము దులిపేలాగా రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే అనుకోకండి, పవన్ కళ్యాణ్ వెనకాల చాలా మంది ఉన్నారు. డబ్బు సంపాదించడానికో, అడ్డగోలుగా స్కాములు చేయడానికి రావడం లేదు....అది మాకు అవసరం లేదు. దేవుడు సినిమా రూపంలో మాకు చాలా ఇచ్చాడు. ప్రజా జీవితంలోకి నిస్వార్థంగా సేవ చేయడానికి వస్తున్నాం. ఎలా చేయాలో మాకుతెలుసు. ఒక సారి కుదరలేదు(చిరంజీవి సమయంలో)...ఈ సారి కుదిరి తీరుద్ది. ఒక్కొక్కడికి ఉంటదిక..... అంటూ నాగబాబు ఆవేశంగా మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X