నొప్పి రెండు రకాలుగా ఉంటుందన్న నాగబాబు... మెగా బ్రదర్ ఎందుకిలా?
Recommended Video
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలవ్వడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఓటమి పాలవ్వడం జనసైనికులను ఒక కుదుపు కుదిపేసింది. నరసాపురం ఎంపీగా పోటీ చేసిన మెగా బ్రదర్ నాగబాబు సైతం ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
అయితే ఓటమి తర్వాత నిరాశలో కూరుకుపోయిన కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్, నాగబాబు. ఓటమి గెలుపుకు తొలి మెట్టు అని, దెబ్బలు తిందాం.. బలంగా పైకి లేద్దాం, భవిష్యత్ మనదే, ఇది ఓటమి కాదు.. విరామం మాత్రమే అంటూ తమదైన శైలిలో మోటివేట్ వేస్టూ ప్రసంగాలు దంచుతున్నారు.

నొప్పి రెండు రకాలుగా ఉంటుందంటున్న నాగబాబు
తాజాగా నాగబాబు తన సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మంచి మాట: నొప్పి రెండు రకాలు - మొదటిది మిమల్ని బాధిస్తుంది. రెండోది మిమల్ని మారుస్తుంది.'' అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన ఓటమిని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టం అవుతోంది.

మాకు మొదటి రకం కంటే రెండో రకమే
నాగబాబు చెప్పిన ఈ మంచి మాటపై అభిమానులు వందల సంఖ్యలో రియాక్ట్ అవుతున్నారు. ‘‘మాకు మొదటి రకం కంటే రెండో రకమే ఎక్కువ సార్లు అనుభవం అయింది సార్.. పర్లేదు.. మేము పైకి లేస్తాం.. బలంగా గెలుస్తాం.'' అంటూ రిప్లై ఇస్తున్నారు. ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ ప్రసంగాలతో అభిమానులు మళ్లీ నూతనోత్తేజం పుంజుకున్నట్లు ఈ కామెంట్స్ బట్టి స్పష్టమవుతోంది.

మంచి అనేది ప్రజలకు నచ్చడానికి లేట్ అవుతుంది
‘‘మంచి మాట, మంచి మనిషి ప్రజలకు నచ్చడానికి లేట్ అవుతుంది, మరో ఐదేళ్లు వెయిట్ చేద్దాం సార్'' అంటూ మరికొందరు అభిమానులు వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ ఎన్నికల్లో ఓటమికి కారణం ఈవీఎంలు ట్యాంపరింగ్ అవ్వడమే అంటున్నారు. ఈ విషయంలో మనం ఫైట్ చేయకుండా సైలెంటుగా ఉండటం సరైంది కాదు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ ముందు ఆ విషయం నేర్చుకోవాలి
మెగా ఫ్యామిలీ ముందు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రత్యర్థులు డబ్బులు ఇచ్చి మరీ మీపై రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. మీ పొలిటికల్ కెరీర్ కావాలనే నాశనం చేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో చతురత ప్రదర్శించడం ఎంతో అవసరం అని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











