మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట.. అదిరిపోయిన సెలబ్రేషన్స్

మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒక్క ఫ్రేమ్‌లో బంధిస్తే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఏదైనా పండుగ అయినా, ప్రత్యేక సందర్భాల్లో మెగా కుటుంబం అంతా ఒక్క చోటకు చేరుతూ ఉంటుంది. ప్రతీ ఏడాది వీరంతా కలిసి వెకేషన్‌కు కూడా వెళ్తుంటారు. తాజాగా నాగబాబు 60వ పుట్టినరోజు వేడకులను అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేశారు.

సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ..

సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ..

మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు సందర్భంగా మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులు బర్త్‌డే విషెస్ తెలిపారు. మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ తన మామపై ఉన్న ప్రేమను తెలుపుతూ బర్త్‌డే విషెస్ తెలిపాడు.

ఎమోషనల్ అయిన వరుణ్ తేజ్

ఎమోషనల్ అయిన వరుణ్ తేజ్

తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ... నీ మొహంపై చిరునవ్వును చూడటానికి ఏదైనా చేస్తాను.. ఇంత గొప్ప జన్మ ఇచ్చినందుకు ధన్యవాదాలు.. అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

గత జన్మలో నా కొడుకువి..

గత జన్మలో నా కొడుకువి..

నాగబాబు పుట్టినరోజు సందర్భంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కూడా వైరల్ అయింది. నీలాగా నన్నెవ్వరూ నవ్వించలేరు.. కోటిలో ఒక్కడివి.. గత జన్మలో నువ్వు కచ్చితంగా నా కొడుకువి అయి ఉంటావని ఎంతో ఎమోషనల్‌ అయింది.

పార్క్ హయత్‌లో ఘనంగా వేడుకలు..

పార్క్ హయత్‌లో ఘనంగా వేడుకలు..

నాగబాబు పుట్టిన రోజు వేడుకలను పార్క్ హయత్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీ అంతా హాజరైంది. చిరంజీవి, సురేఖ, అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు స్నేహ, కళ్యాణ్ దేవ్, శ్రీజ, సుష్మిత, ఉపాసన, రామ్ చరణ్ ఇలా అందర్నీ ఒకే ఫ్రేమ్‌లో చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X