బాలకృష్ణ పెద్ద కమెడియన్.. అలాంటి వ్యక్తి గురించి తెలియదని చెప్పడం పొరపాటే.. నాగబాబు!
మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ గురించి, పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి, మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అలాగే పవన్ కళ్యాణ్ వివాహాల గురించి రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై ఘాటుగా స్పందించారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలపై నాగబాబు మరోమారు క్లారిటీ ఇచ్చారు.

బాలకృష్ణ ఎవరో తెలియదు
బాలకృష్ణ గురించి మీ అభిప్రాయం ఏంటని యాంకర్ అడగగా.. బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదు అని నాగబాబు అన్నారు. నాగబాబు వ్యాఖ్యలతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నందమూరి అభిమానుల నుంచి నాగబాబుకు విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శలపై తాజాగా నాగబాబు క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పడం పొరపాటు అంటూనే మరోమారు అగ్గి రాజేశారు.

తెలియదనడం నిజంగా నా తప్పే
నా ఇంటర్వ్యూలో తప్పు దొర్లింది. బాలకృష్ణ గురించి అడిగితే తెలియదు అని చెప్పేశా. దీనితో కొంతమంది ఫీల్ అయ్యారని నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పడం తప్పు కదా.. ఆయన ఎవరో మీకు నిజంగా తెలియదా అని నన్ను ప్రశ్నించారు. అలా మాట్లాడడం నిజంగా నా తప్పే. బాలకృష్ణ గారి గురించి తెలియని వారు ఎవరుంటారండీ.. ఆయన పెద్ద కమెడియన్ అని నాగబాబు వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్‌తో ఎన్నో చిత్రాల్లో
వల్లూరి బాలకృష్ణ మంచి నటుడు, పెద్ద కమెడియన్. ఆయన ఎన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించారు అని నాగబాబు అన్నారు. అలాంటి నటుడి గురించి తెలియదని చెప్పడం నేను చేసిన తప్పే. ఆ నటుడు ఇతనే అంటూ పాతత రం నటుడు వల్లూరి బాలకృష్ణ ఫోటోని నాగబాబు చూపించారు. వల్లూరి బాలకృష్ణకు అంజిగాడు అనే నిక్ నేమ్ కూడా ఉందని నాగబాబు తెలిపారు. వల్లూరి బాలకృష్ణ గారి గురించి వికీపీడియాలో అనేక వివరాలు ఉన్నాయని నాగబాబు తెలిపారు.
నందమూరి ఫ్యాన్స్ ఫైర్
బాలయ్య ఎవరో తెలియదని చెప్పడంతో నందమూరి అభిమానులు నాగబాబుపై ఫైర్ అవుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది. నాగబాబు తరచుగా సోషల్ మీడియా వేదికగా పలు అంశాల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. పేస్ బుక్ లైవ్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలయ్య గురించి నాగబాబు ఈ కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











