పిక్ ఆఫ్ ది డే.. అమ్మ బర్త్ డే.. ఒకే ఫ్రేమ్‌లో చిరు, పవన్, నాగబాబు
మెగా హీరోలందరూ ఒకే చోట కలవడం ఒకెత్తు అయితే.. మెగా బ్రదర్స్ కలవడం మరో ఎత్తు. ఎన్ని ఫ్రేముల్లో ఎంత మంది ఉన్నా కూడా మెగా బ్రదర్స్ ఒకే పిక్‌లో కనిపిస్తే వచ్చే కిక్కే వేరప్పా. అందులో మరీ ముఖ్యంగా తమ మాతృమూర్తి అంజనా దేవీ సమక్షంలో ఇలా ముగ్గురు సోదరులు కలిస్తే అభిమానులకు కలిగే సంతృప్తి వేరే లెవెల్‌లో ఉంటుంది. నేడు అంజనా దేవీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోటకు చేరింది.

తల్లిపై ప్రేమ..
తల్లి పుట్టినరోజు సందర్భంగా నాగబాబు ఎమోషనల్ అయ్యాడు. మా బలం, నా చీకటి దారుల్లో వెలుగు నింపిన దీపం..నీ చల్లని చూపు.. స్పర్శ చాలు అమ్మ నా బాధలన్నీ ఎగిరిపోతాయి.. నీ చిన్న మాట చాలు నాలో కొండంత బలాన్ని నింపుతుంది.. నీలాంటి ఓ స్ట్రాంగ్ అమ్మ వల్లే నా లాంటి స్ట్రాంగ్ మనుషులు తయారవుతారు అంటూ అమ్మ గొప్పదనాన్ని నాగబాబు చెప్పుకొచ్చాడు.

చిరు అలా..
ఇక అమ్మ పుట్టిన రోజు సందర్భంగా మాటల్లో వర్ణించలేని ఎన్నో భావాలను ఓ వీడియో రూపంలో షేర్ చేశాడు చిరంజీవి. జన్మనిచ్చిన అమ్మకు జన్మ దిన శుభాకాంక్షలు అని చెబుతూ.. డాడీ సినిమాలో బ్యాక్ గ్రౌండ్‌తో అమ్మతో కలిసి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు దిగిన ఫోటోలన్నీ కూడా షేర్ చేశాడు. ఇక అందులో ఎన్నో మెమోరీస్ దాగి ఉన్నట్టు కనిపిస్తోంది.

తాజాగా ఇలా..
అయితే నేటి సాయంత్రం అందరూ కూడా చిరంజీవి ఇంట్లోనే అంజనమ్మ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. ఈ మేరకు బయటకు వచ్చిన ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో చిరు సోదర సోదరిమణులున్నారు. అంజనమ్మ సంతానం మొత్తం ఇదే ఫోటోలో ఉంది.

ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్..
అంజనమ్మ బర్త్ డే సందర్భంగా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు సందడి చేశారు. ఇందులో చిరు సతీమణి సురేఖా, నాగబాబు భార్య పద్మజ ఉన్నారు. వారితో పాటు చిరు చెల్లెళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

అంతులేని సంతోషం..
ఆ మెగా పిక్‌ను నాగబాబు షేర్ చేస్తూ.. కొందరు మనకు అంతులేని సంతోషాన్ని ఇస్తుంటారు.. కొన్నింటిని సెలెబ్రేట్ చేస్తే సంతోషంగా ఉంటుంది.. కానీ ఇదంతా నీ వల్లే.. ఈ సంతోషానికి కారణం నువ్వే.. నీ బర్త్ డేను సెలెబ్రేట్ చేయడంలో ఉందే సంతోషం, కలిగే ఆనందం ఎప్పుడూ ఇలాగే ఉంటుందమ్మా.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో ఉంటే అంతులేని సంతోషం కలుగుతుందని నాగబాబు చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











