పంజా ప్రీమియర్ షో చూసిన మెగాబదర్స్: దుమ్మురేపుద్దంటున్న నాగబాబు
'మా ఫేస్ లో చూస్తే తెలియట్లే..సినిమా సూపర్ హిట్..మ్యూజిక్..యాక్షన్..డైరెక్షన్..ఒకటేమిటి..సినిమాలో అన్నీ హైలైట్సే...' ఇదీ పంజా సినిమా గురించి మెగా బ్రదర్ నాగబాబు చెప్పిన మాట. నిన్న ప్రీమియర్ షో చూసిన నాగబాబు, 'పంజా' సినిమా అభిమానులకు పెద్ద పండగేననీ, వసూళ్ళలో దుమ్మురేపుద్దనీ ఉత్సాహంగా చెప్పుకొచ్చాడు. కామెడీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అనీ, పవన్ స్టయిలిష్ లుక్ తో సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడనీ అంటున్నాడు నాగబాబు. ఈ ప్రీమియర్ షోకి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ అల్లు అరవింద్ తో పాటు ఇతర ప్రముకులు తిలకించారు.
'పంజా' ఆడియో విడుదల వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా డుమ్మా కొట్టేశారనే కథనాల నేపథ్యంలో, ప్రీమియర్ షోకి వెళ్ళిన నాగబాబు, సినిమా సూపర్ హిట్...అంటూ ఉత్సాహంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, 'పంజా'మేనియాలో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగా తేలుతున్నారు. చూద్దాం..నాగబాబు మాటల్లో నిజమెంతో..పంజా'లో మేటరెంతో? మరికొద్దిసేపట్లో మా రివ్వూతో తేలిపోతుంది.


Click it and Unblock the Notifications











