Lavanya Tripathi: గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు లావణ్య... వారసుడు వచ్చాడంటూ పోస్ట్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తునే.. ఇటీవల ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించింది. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సిరీస్ మిస్ ఫర్ఫెక్ట్. ఇక ఈ సిరీస్ తో పాటు పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వారసుడు వచ్చాడు అంటూ పోస్ట్ పెట్టగా వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ తో పెళ్లి తర్వాత మెగా కోడలిగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇంటి కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తునే... మరోవైపు తన ప్రోఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఓ వైపు భర్త వరుణ్ తేజ్ తో కలిసి ఇటీవల హనీమూన్ ట్రిప్ కు వెళ్లిన ఈ భామ... ప్రస్తుతం ఫ్యామిలీ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

లావణ్య త్రిపాఠి చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే.. తమ ఇంట్లోకి వారసుడు వచ్చాడు అంటూ పోస్ట్ చేసింది. అయితే ఆ వారసుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాడు కాదు.. లావణ్య త్రిపాఠి అమ్మ గారింటి తరుఫు వారిదని తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే.. లావణ్య త్రిపాఠి.. తమ ఇంట్లోకి వారసుడు వచ్చినట్టు చెప్పింది. ఈ మేరకు చిన్నారి ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. తన సోదరుడికి పండంటి బిడ్డ పుట్టినట్టు తెలిపింది.

లేడిస్ అండ్ జెంటిల్ మెన్... త్రిపాఠి డింపుల్ స్ట్రాంగ్ అంటూ చెప్పుకువచ్చింది. ఇక ఇప్పటికే లావణ్య త్రిపాఠికి కూడా డింపుల్ ఉన్న విషయం తెలిసిందే. లావణ్య త్రిపాఠి ఫ్యామిలీలో చీక్స్ కి సొట్టలు ఉండటం తెలిసిందే. దీంతో తమ వారసులకు అదే వచ్చిందని రాసుకువచ్చింది లావణ్య. ప్రస్తుతం చిన్నారి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. మరి మీరెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక లావణ్య విషయానికి వస్తే... ఆమె ఇటీవల ఓ వెబ్ సిరీస్‌ని ప్రకటించింది. మిస్ పర్‌ఫెక్ట్ అనే సిరీసును బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ తో కలిసి చేస్తుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు వరుణ్ తేజ్.. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











