Niharika Chaitanya Divorced: అవును.. నిహారిక - చైతన్య విడిపోయారు.. కోర్టు నుంచి డైవర్స్!
అనుకున్నదే నిజమైంది. అవును వారిద్దరూ విడిపోయారు. ఇంతకీ ఆ జంట మరెవరో కాదు. నిహారిక కొణిదెల-చైతన్య జొన్నలగడ్డ. తాజాగా దీనిపై అధికార ప్రకటన వచ్చిందంటూ బయట వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే....
ఫొటోస్ డిలీట్: గత కొంతకాలంగా నిహారిక కొణిదెల తన భర్త చైతన్యతో విడిపోయిందంటూ జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతన్య-నిహారిక జంట ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి తమకు సంబంధించిన ఫొటోలను తొలిగించారు. దీంతో ఈ జంట విడిపోతున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరికి సంబంధించి ప్రతి వార్త నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే వస్తున్నాయి.

అన్నీ సింగిల్ గానే: ఇక మెగా ఫ్యామిలీలో జరిగిన అన్ని ఈవెంట్లకు నిహారిక సింగిల్ గా రావడం, బయట కూడా ఒక్కటిగా కనిపించడం కూడా అనుమానాలను మరింత బలపరిచింది. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కవగా అవ్వడం వల్లే.. వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారని తెలిసింది. ఆ మధ్యలో నిహారిక.. హైదరాబాద్‌లో తన నిర్మాణ పనులు చూసుకోవడానికి ఓ కొత్త ఆఫీస్‌ను కూడా ప్రారంభించింది. రీసెంట్ గా ఆ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.
ఇందుకు సంబంధించిన ఫొటోలను నిహారిక తన సోషల్ మీడియా అధికారిక అకౌంట్ లోనూ షేర్ చేసింది. కానీ ఈ ఫొటోల్లోనూ నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ ఎక్కడ కనిపించలేదు. నిహారిక అన్ని ఒంటరిగానే తన పనులు చేసుకుంటోందని అర్థమైంది. ఇక ఆ మధ్యలో బయట షికార్లకు, ట్రిప్పులు అంటూ తన ఫ్రెండ్స్ తో సరదాగా వెళ్లి గడిపింది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో అనుమానాలను మరింత బలపరిచాయి.

డివర్స్ ప్రక్రియ: ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఈ జంట విడిపోయిందంటూ, ఇది అధికారిక ప్రకటన అంటూ కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ జంటకు మనస్పర్థలు రావడంతో ఆ మధ్యలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట. తాజాగా విడాకుల ప్రక్రియ కూడా పూర్తైందట. కోర్టు విడాకులు కూడా మంజూరు చేసిందట. అయితే ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ నుంచి లేదా చైతన్య కుటుంబం నుంచి ఎవరూ అధికారికంగా చెప్పలేదు. దీని గురించి ఎటువంటి పోస్ట్ చేయలేదు. ఒకవేళ ఇదంతా నిజమైతే.. విడాకులతో తమ రెండేళ్ల వివాహ బంధానికి ఈ జంట ముగింపు పలికినట్టే.

2020లో గ్రాండ్ గా: మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. యాంకర్‌గా, హీరోయిన్‌గా, నిర్మాతగా రాణిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2020 డిసెంబరులో చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. ఉదయ్‌పుర్ వేదికగా వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. చాలా మంది సెలబ్రిటీలు కూడా హజరై సందడి చేశారు. చివరిగా అంత గ్రాండ్ గా జరిగిన వీరి వివాహం.. మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయిందని అభిమానులు బాధపడుతున్నారు.


Click it and Unblock the Notifications











