ప్రేమ గురించి నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ పోస్ట్.. కొంపదీసి లవ్‌లో పడిందా ఏంటి?
నిహారిక కొణిదెల ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు తన మాజీ భర్త చైతన్య జొన్నల్లగడ్డ కాపురం చేసిన ఈ మెగా డాటర్ విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ప్రస్తుతం లైఫ్‌ను చిల్‌గా గడుపుతోంది. అలా ఓ వైపు ఫ్రీడమ్ లైఫ్‌ను లీడ్ చేస్తూనే సినిమాలపై మరింత దృష్టి పెడుతోంది. అలానే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. దీంతో నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని గురించి పూర్తి కథనం స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
నిహారిక గురించి ప్రత్యేేకంగా చెప్పనక్కర్లేదు. మెగా డాటర్ బ్రాండ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ భామ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయింది. నటిగా ఓకే అనిపించుకుంది కానీ స్టార్ హీరోయిన్ సక్సెస్ కాలేకపోయింది. ఇక పర్సనల్ లైఫ్ మ్యారేజ్ విషయంలో మొదట్లోనే ఫెయిల్ అయింది. 2020లో రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలస్‌లో గ్రాండ్‌గా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఈమె ఎక్కువ కాలం కాపురం చేయలేకపోయింది.

తాను చేసే పనులకు అత్తింటి వారు ఆంక్షలు పెట్టడం నచ్చని నిహారిక భర్తతో విడిపోయిందనే ఓ ప్రచారం కూడా వాదనలో ఉంది. ఏదిఏమైనా విడాకుల వచ్చాక నిహారిక ఫ్రీడమ్ లైఫ్‌ను గడుపుతున్నట్టుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిని చూస్తే అర్థమవుతోందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. టూర్స్‌కు వెళ్లడాలు, అక్కడ గ్లామర్ ఫొటోషూట్స్ చేయడం, వాటికి కొటేషన్లు, క్యాప్షన్లు జోడించడం చేస్తోంది.

అలా తాజాగా ఓ కొటేషన్ ఫొటోను పోస్ట్ చేసింది. ఆల్ యూ నీడ్ ఈజ్ లవ్ అండ్ బీచ్. అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ప్రేమే మరియు బీచ్ అని అర్థం వచ్చేలా ఇది పెట్టింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమెకు ఫ్రీడమ్ అండ్ హ్యాప్ లైఫ్ దొరికిందని, మళ్లీ ప్రేమలో పడిందా ఏంటి? నిహారిక ప్రేమను కోరుకుంటోంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పుడామె గోవా పర్యటనలో ఉంది. అక్కడి బీచ్ అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది.
పొట్టి గౌన్ డ్రెస్ వేసుకుని ఊయ్యాల కూడా ఊగుతూ కనిపించింది. వీటికి సంబంధించిన ఫొటోలను వీడియోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పెడుతోంది. ఇకపోతే విడాకులు అనంతరం నిహారిక కెరీర్ పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. నటిగా, నిర్మాతగా రాణించాలని పట్టుదలతో ఉంది. ఆ మధ్య డెడ్ ఫిక్సెల్స్ టైటిల్‌తో ఒక వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆఫీస్ ఓపెన్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్‌ను ప్లాన్ చేస్తోంది. రీసెంట్గా తమిళంలో ఓ సినిమాను కూడా ఓకే చేసింది.

'మద్రాస్ కారన్' పేరుతో కోలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకునే ఈ చిత్రానికి వాలి మోహన్‌దాస్ దర్శకత్వం వహించనుండగా ఇందులో నిహారిక కొణిదెల నటిస్తుంది. ఇక ఈ సినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఆర్ ప్రొడక్షన్స్ బ్యానరుపై నిర్మించే ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఇక ఈ సినిమాతో మళ్లీ తన కెరియర్ గాడిలో పడనుందని అంటున్నారు నిహా ఫ్యాన్స్. చూడాలి మరి.


Click it and Unblock the Notifications











