Niharka Konidela: విడాకుల తర్వాత నిహారిక ఆ నలుగురి గురించి పోస్ట్... వాళ్లు అలాగే ఉంటారంటూ...
మెగాడాటర్ నిహారిక... ఈ మధ్య తన విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈమె... నటిగా నిర్మాతగా రాణిస్తూ కెరీర్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఇటీవ తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత నిహారిక అమ్మాయిల గురించి చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే....

మెగా డాటర్ ఎంట్రీ...: నటుడు నాగబాబు కుమార్తె నిహారిక.. తొలుత బుల్లితెర యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకుని చర్చనీయంశంగా మారింది. ఇప్పుడు ఈ డివొర్స్ వ్యవహారం ముగిశాక.. నిహారిక.. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గానే....:నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా విడాకుల తర్వాత ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోను గమనిస్తే... ఈ డివొర్స్ వ్యవహారం ముగిశాక.. నిహారిక కాస్త ఆనందంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఓ నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా గడుపుతున్న ఫొటోను అందులో కనపిస్తుంది. ఇక నిహారికకు ఫ్రెండ్స్ ఎక్కువే. ఎప్పుడూ తన ఫ్రెండ్స్ తో గడుపుతూ ఉంటుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

ఇలా ఉంటారంటూ...: అయితే ఇప్పుడు ఆ వీడియోలో... అమ్మాయిలు ఇలా ఉంటారంటూ చెప్పుకొచ్చింది. ప్రతి అమ్మాయిల గ్యాంగ్‌లో ఇలా నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారంటోంది. తనని తాను ఉద్దేశిస్తూ.. ఒకరు ఎప్పుడు మంచిగా డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు అని చెప్పింది. ఇంకొకరు ఎప్పుడూ ఏదీ వేసుకున్నా కాన్ఫిడెంట్‌గా ఉంటారని చెప్పింది. మరొకరు.. ఎప్పుడు కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపరు, చివరిగా ఓ మహాతల్లి ఉంటుంది.. తనెప్పుడు అస్సలు కనపడదు.. అంటూ చెప్పుకొచ్చింది.
మనస్పర్థలు రావడం వల్లే...: ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. కొంత మంది పాజిటివ్ కామెంట్స్ పెడుతుంటగా.. మరికొంత మంది నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే 2020 డిసెంబర్‌లో నిహారిక- చైతన్య జొన్నలగడ్డ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం వల్లే ఈ విడాకులు తీసుకున్నారని సమాచారం. వీరి వివాహం మూణ్ణాళ్ల ముచ్చటగా మిగలిందని అంతా అంటున్నారు. నిరాశలో మెగా అభిమానులు ఉన్నారు.


Click it and Unblock the Notifications











