Niharika: మెగా డాటర్ లిప్ లాక్ ఫొటో వైరల్.. నెవ్వర్ బిఫోర్ అనేలా...
మెగా ఫ్యామిలీకి చెందిన వారిలో నేటితరం అబ్బాయిలు అందరూ కూడా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీకి టచ్ లో ఉంటున్నారు. ఇక అమ్మాయిలలో కూడా మెగా డాటర్స్ అదే తరహాలో టచ్ లో ఉంటున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూతురు కూడా ఇండస్ట్రీలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆమె ఇటీవల కాలంలో కొన్ని కాంట్రవర్సీ వార్తలతో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక మొదటిసారి నిహారిక లిప్ లాక్ సంబంధించిన ఫొటో కూడా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

మొదట రియాలిటీ షోలతో
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నిలదొక్కుకున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు నిహారిక కూడా టెలివిజన్ రంగం నుంచి వెండితెర వరకు బాగానే ఎట్రాక్ట్ చేసింది. మొదట రియాలిటీ షోలతో యాంకర్ గా చేసిన నిహారిక ఆ తరువాత ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ ను సరికొత్తగా స్టార్ట్ చేసింది. కానీ ఆ సినిమా అంతగా క్లిక్కవ్వలేదు.

డిఫరెంట్ గా ట్రై చేయాలని..
ఇక తమిళంలో కూడా నిహారిక ఒక సినిమాలో నటించింది కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఆ తరువాత డిఫరెంట్ గా ట్రై చేయాలని అమ్మడు హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అనే మరో రెండు సినిమాలు చేసింది. కానీ అవేవి కూడా క్లిక్కవ్వలేదు.

అదే చివరి సినిమా
ఇక నిహారిక పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన సై రా సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించి పరవాలేదు అనిపించే విధంగా ఆకట్టుకుంది. ఇక ఆ విధంగా క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ మళ్ళీ సినిమాల్లో నటించింది లేదు. మధ్యలో కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా నిహారిక నటనపై పెద్దగా ఆసక్తిని చూపించలేదు.

భర్తతో విబేధాలు
ఇక 2020లో నిహారిక పోలీస్ ఫ్యామిలీకి చెందిన చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. ఇక ఆ పెళ్లి వేడుక నుంచి సరికొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిన నిహారిక మధ్యలో తన భర్తతో విబేధాల కారణంగా దూరంగానే ఉన్నట్లు టాక్ వచ్చింది. హఠాత్తుగా ఇన్ స్టాగ్రామ్ ను డిలీట్ చేయడంతో ఆమె విడిపోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి.

లిప్ లాక్ ఫోటో వైరల్
అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిహారిక ఇదివరకే ఇన్స్టా లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఒక క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లిప్ లాక్ పోతో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిహారిక తన భర్త చైతన్యను ముద్దాడుతున్న ఆ ఫొటో కాస్త బ్లర్ చేసినట్లుగా ఉంది. ఇక ఆ ఫొటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హాలిడేస్ లో ఇలా..
ఇక నిహారిక ప్రస్తుతం జోర్డాన్ లో తన భర్తతో కలిసి హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక ఆమె సినిమాల్లో నటించడం లేదు గాని పలు వెబ్ సీరీస్ లను నిర్మించే ప్రయత్నం అయితే చేస్తోంది. రీసెంట్ గా తన భర్తతో కలిసి ఒక వెబ్ ప్రాజెక్ట్ ను కూడా స్టార్ట్ చేసింది. మరి కొత్త ప్రొడక్షన్ హౌస్ తో అమ్మడు ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











