Sreeja: గుండె బద్దలైనప్పుడు అదొక్కడే మార్గం... మెగా డాటర్ ఎమోషనల్.. ఆ విషయం గురించేనా?

మెగా ఫ్యామిలీలో ఇటీవల పెళ్లి సందడి నెలకొన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు.. అల్లు ఫ్యామిలీ, సన్నిహితులు హాజరు అయి సందడి చేశారు. ఇదిలా ఉండగా... చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. గుండె బద్దలైనప్పుడు అదొక్కటే మార్గం అంటూ తెగ ఎమోషనల్ అయింది. అయితే ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1వ తేదీన ఇటలీలో జరిగింది. ఇక ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, ఇతర సన్నిహితులు హాజరు అయి సందడి చేశారు. ఇక ఇటీవల నూతన వధూవరులు హైదరాబాద్ కూడా తిరిగివచ్చేశారు. ఇక వీరి పెళ్లిలో మెగా డాటర్ చిరంజీవి చిన్న కూతురు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈమె వరుణ్ తేజ్, లావణ్యలతో కలిసి ఫోటోలు కూడా దిగింది. నెట్టింట నిహారిక, శ్రీజ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

Mega Daughter Sreeja Konidela Interesting Post on Instagram Goes Viral

అయితే ఇదిలా ఉండగా... శ్రీజ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీజ... తన ఫ్యామిలీ గురించి, ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఓ పోస్ట్ చేయగా... అది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. గుండె ముక్కలైనప్పుడు అదొక్కడే మార్గం అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.

అసలు ఆ పోస్టులో ఏం ఉందంటే... విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేస్తున్నప్పుడు... హృదయం గాయపడుతుంది... విరిగిపోతుంది, మనస్సు కలత చెందుతుంది.. క్షీణిస్తుంది... శరీరం అలసిపోతుంది మరియు బలహీనంగా ఉంటుంది. అలాంటి సమయంలోనే కళ్ళు మూసుకుని, నిర్మలమైన అంతర్గత ప్రపంచానికి మళ్లీ కనెక్ట్ అవ్వండి. ఇదొక్కటే మార్గం.... అంటూ రాసుకువచ్చింది.

Mega Daughter Sreeja Konidela Interesting Post on Instagram Goes Viral

అయితే ఇంత ఫీలాసఫీ చెప్పిన శ్రీజ.. ఈ పోస్టుకు మాత్రం కామెంట్లను డిజబుల్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పోస్ట్ వెనుక అసలు కారణం కల్యాణ్ దేవ్ తో విడిగా ఉండటమే అని నెట్టింట చర్చ నడుస్తోంది. కల్యాణ్ దేవ్ తో శ్రీజకు 2016లో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి విడిపోయారంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయాలపై ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు.

ఇక ఇటీవల వరుణ్ తేజ్ పెళ్లికి సైతం కల్యాణ్ దేవ్ రాలేదు. దీంతో చాలా మందికి వీరు విడిపోయినట్లే అని క్లారిటీ వచ్చింది. ఇక ఆ విషయంపైనే శ్రీజ పోస్ట్ చేసిందని అంటున్నారు. ఇక ఇటీవల వరుణ్ పెళ్లిలో శ్రీజ ఫోటోస్ వైరల్ కాగా.. చాలా మంది శ్రీజ, నిహారికలపై బ్యాడ్ కామెంట్స్ చేశారు. భర్తలను వదిలేశారంటూ నెట్టింట కామెంట్స్ పెట్టారు. అయితే ఇవన్నీ చూసిన శ్రీజ అలాంటి పోస్ట్ పెట్టిందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X