Sreeja Konidela: గుడ్ న్యూస్ చెప్పిన మెగా డాటర్ శ్రీజ... కొత్త ప్రయాణం మొదలు!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం భర్తతో వేరుగా ఉంటున్న ఈమె.. సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. తన గురించి తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు సంబంధిత విషయాలను తెలియజేస్తుంది. ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం పెట్టిందో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
మెగా స్టార్ చిన్న కూతురు శ్రీజ అప్పట్లో తన పెళ్లితో సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ... ఆ తర్వాత మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంట్లో వాళ్ల సమక్షంలో కల్యాణ్ దేవ్ తో ఏడడుగులు వేసింది. ఇక వీరికి కూడా ఓ పాప పుట్టింది. కల్యాణ్ దేవ్ కూడా పలు సినిమాల్లో నటించాడు కూడా. విజేత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక శ్రీజకు రెండో పెళ్లి అయినప్పటికీగా బాగానే ఉంటారు అనుకునేలోపు వీరు వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. శ్రీజ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే ఉంటుండగా.. కల్యాణ్ దేవ్ అతని తల్లిదండ్రులతో ఉంటున్నారు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించకపోయినా.. వీరు విడిగానే ఉంటున్నారు. ఇక ఎవరి లైఫ్ వారు జీవిస్తున్నారు. వీరి కూతురు మాత్రం కొద్ది రోజులు తండ్రి దగ్గర కొద్ది రోజులు తల్లిదగ్గర ఉంటుంది.
కల్యాణ్ దేవ్ సోషల్ మీడియా ఓసారి పరిశీలిస్తే.. ఇటీవల కూతురు తనతో టైం స్పెండ్ చేసినట్లు వీడియోలు పోస్ట్ చేశాడు. ఇక కూతురు బర్త్ డే, తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వీరు విడిగానే ఉంటున్నట్లు అందరికీ ఓ స్పష్టత వచ్చేసింది. ఆ విషయం పక్కన పెడితే శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

శ్రీజ 2023లోనే కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. తాను తన బలాన్ని కనుగొన్నానని.. కొత్త ప్రయాణం ప్రారంభమైందని అప్పుట్లో ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా శ్రీజ కొణిదెల ఒక కొత్త ఫోటోని నెటిజన్లతో పంచుకుంది. దానికి అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. యు ఆర్ యువర్ బెస్ట్ ఛీర్ లీడర్ అంటూ రాసుకువచ్చింది. అంటే నీకు నువ్వే ఉత్తమమైన ఛీర్ లీడర్ అని అర్థం. శ్రీజ చెమటలతో తడిసిన ఈ ఫోటోని చూస్తుంటే తాను జిమ్ సెషన్ లో ఉన్నట్లు అర్థం అవుతుంది.
ఇక ఈ ఫోటోపై కొన్ని వర్డ్స్ ప్లే అవుతున్నాయి. అందులో రెండడుగులు ముందుకు ఒకడుగు వెనక్కి... ఇది కూడా ముందుకు సాగే ప్రయాణం అని రాసి ఉంది. చేసే పనిలో సూక్ష్మమైన ప్రగతిని సాధించినా కానీ దానిని సెలబ్రేట్ చేసుకోవాలని కూడా శ్రీజ ఇలా సోషల్ మీడియా వేదికగా చెప్పుకువచ్చింది. శ్రీజ పోస్ట్ చూస్తుంటే... ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారి జిమ్ లో శ్రమిస్తుందని తెలుస్తోంది. ఇక దీనితోనే తన కొత్త ప్రయాణం మొదలు అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











