సైరా: 8 నెలలు రీసెర్చ్ చేసిన మెగాడాటర్, టీజర్ చూసి ఎమోషనల్‌గా!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ నిర్మించిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు చిరంజీవి భార్య సురేష, తల్లి అంజనీదేవి, కూతురు సుష్మిత కూడా హాజరయ్యారు. ఈ చిత్రానికి సుష్మిత కాస్టూమ్ డిజైనర్‌గా పని చేస్తున్న సంగతి తెలిసిందే.
టీజర్ గురించి సుష్మిత మాట్లాడుతూ టీజర్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశాం. టీజర్ చూసిన తర్వాత ఎమెషనల్ అయ్యాం. నాకు ఈ సినిమాలో పని చేసే అవకాశం ఇచ్చిన చరణ్‌కి, మా నాన్నకి, దర్శకుడికి చాలా థాంక్స్. మంచి టీమ్‌తో కలిసి పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.

ఈ సినిమాకు కాస్టూమ్స్ సిద్ధం చేయడానికి చాలా మంది పనిచేస్తున్నారు. ఈ సినిమా కథ అనుకున్న వెంటనే ఎలాంటి కాస్టూమ్స్ వాడాలి అనే విషయమై రీసెర్చ్ ప్రారంభించాం. ఎలాంటి డిజైన్స్ వాడాలి, ఎలాంటి కలర్స్ వాడాలి, ఎలాంటి మెటీరియల్ వాడాలి అనే విషయపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత వాటిని తయారు చేయడానికి 8 నెలల సమయం పట్టింది అని సుష్మిత తెలిపారు.
1800 ప్రాంతంలో జరిగిన కథ కాబట్టి ముఖ్యంగా కాస్టూమ్స్‌కు వాడే కలర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాడే కెమిక్స్, కలర్స్ వంటివి అప్పుడు లేవు. ఆథంటిసిటీ కోసం ప్రయత్నం చేశాం. నేరుగా వీవర్స్ నుంచి తీసుకున్నామని సుష్మిత తెలిపారు.


Click it and Unblock the Notifications











