మెగాస్టార్ పుట్టినరోజున ఆమె కూడా సర్ ప్రైజ్ ఇవ్వనుందట
మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన 65వ పుట్టినరోజును జరుపుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజున మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ రానున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మొదటి పోస్టర్ ని విడుదల చేయనున్నట్లు రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే అదే రోజు తన తండ్రికి విషెస్ అందిస్తూ మెగా డాటర్ సుస్మిత కూడా మెగా అభిమానులకు ఒక సర్ ప్రైజ్ ఇవ్వనుందట. ఆమె గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే ప్రొడక్షన్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే నిర్మాతగా ఒక వెబ్ సిరీస్ ని కూడా స్టార్ట్ చేశారు. ఓయ్ దర్శకుడు ఆనంద్ రంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ వెబ్ సిరిస్ కి సంబంధించిన స్పెషల్ అప్డేట్ ని మెగాస్టార్ పుట్టినరోజున విడుదల చేయనున్నారట.

ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ వంటి సీనియర్ స్టార్స్ నటిస్తున్న ఆ వెబ్ సిరీస్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందనుందట. ముందుగా ఈ వెబ్ సిరిస్ కోసం ఒక సీనియర్ హీరోను సంప్రదించగా ఆయాన రిజెక్ట్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇక ఆ మధ్య కొందరు యూనిట్ సబ్యులకు కూడా కరోనా సోకడంతో షూటింగ్ కి బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఇక ఎలాగైనా ఆ వెబ్ సిరిస్ తో నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని సుస్మిత ప్రయత్నాలు చేస్తోంది. అలాగే మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మరికొన్ని భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా సుస్మిత వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











