మెగాస్టార్ కూతురు మొదటి సినిమా.. ఆ యువ హీరోతో రిలీజ్ డేట్ ఫిక్స్!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు అందరూ కూడా మార్కెట్ లో వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారు. కేవలం మొదటి సినిమా వరకే చిరంజీవి వారి ఫ్యామిలీ హీరోలకు సపోర్ట్ చేస్తుండగా ఆ తరువాత ఎవరికి వారు సొంతంగా కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక ఆ ఫ్యామిలీలో అమ్మాయిలు కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదివరకే నాగబాబు కూతురు నిహారిక యాంకర్ గా నటిగా అడుగులు వేసింది. ఇప్పుడు నిర్మాతగా వెబ్ సీరీస్ లను కూడా నిర్మిస్తున్నారు. అయితే చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత కొణిదెల కూడా సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. నటిగా కాకుండా ఆమె మొదట కాస్ట్యూమ్ డిజైనర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాకు కూడా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు. మెగాస్టార్ అందంగా కనిపించడంలో కూడా ఆమె పాత్ర చాలానే ఉంది.

అలాగే సైరా నరసింహారెడ్డి సినిమాకు కూడా ఆమె వర్క్ చేశారు. ఇక అదే విధంగా ఆమె రామ్ చరణ్ తేజ్ రంగస్థలం సినిమాకు కూడా వర్క్ చేయడం జరిగింది. అయితే ఆ రూట్లో కొనసాగుతూనే నిర్మాతగా కూడా ఆమె కనబడడంతో కలిసి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. మొదట కొన్ని వెబ్ సిరీస్ లో నిర్మించిన సుష్మిత ఇప్పుడు యువ హీరోలతో చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు.
ఇక ఆమె ఇటీవల యువ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక సినిమాను నిర్మించారు. ఇక సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రశాంత్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరపైకి తీసుకు రానున్న 'శ్రీదేవి శోభన్ బాబు' అనే సినిమాను ఫిబ్రవరి 18మా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. గోల్డ్ బాక్స్ బ్యానర్ లో సుస్మిత అలాగే ఆమె భర్త విష్ణు ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా అవుట్ పుట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న సుస్మిత ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











