డ్యామేజ్ కాకుండా...తలో చెయ్యి వేస్తున్న మెగా హీరోలు!
హైదరాబాద్: మోగాస్టార్ చిరంజీవి వారసులుగా హీరోలుగా పరిచయమై పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సక్సెస్ అయ్యారు. అయితే అల్లు శిరీష్ మాత్రం తొలి ప్రయత్నంలో దెబ్బతిన్నాడు. త్వరలో 'రేయ్' చిత్రం ద్వారా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ హీరోగా పరిచయం కాబోతున్నాడు. బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో 'రేయ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లు శిరీష్ మాదిరి....సాయి ధరమ్ తేజ్ తొలి సినిమా హిట్ కాకపోతే మెగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో అతన్ని హీరోగా విజయవంతంగా నిలబెట్టడానికి మెగా హీరోలంతా తలో చెయ్యి వేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు 'రేయ్' దర్శకుడు వైఎస్ చౌదరి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు రెడీ అయ్యారు.
మెగా ఫ్యామిలీ హీరోలందరి సహకారంతో ఈ సినిమాకు విభిన్నమైన పబ్లిసిటీ తెచ్చేందుకు ట్రై చేస్తున్నాడు వైవిఎస్ చౌదరి. మరి రేయ్ పబ్లిసిటీ ఎలా ప్లాన్ చేసారు? అనే విషయాలను స్లైడ్ షోలో చూద్దాం.

సాయి ధరమ్ తేజ్
రేయ్ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన సయామీ ఖేర్ నటిస్తోంది. శ్రద్ధాదాస్ ముఖ్యపాత్రలో కనిపించనుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈచిత్రం పబ్లిసిటీ సరికొత్తగా చేయబోతున్నారు.

బన్నీతో ఎ టు జెడ్ లుక్
రేయ్ చిత్రానికి సంబంధించిన ఎటు జెడ్ లుక్ ఆవిష్కరణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా జరిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 1న ఈ కార్యక్రమం జరుగనుంది.

పవన్ కళ్యాణ్ తో ఆడియో రిలీజ్
‘రేయ్' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించి గ్రాండ్‌గా ఆడియో వేడుక చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్లాటినమ్ డిస్క్ వేడుకకు చిరంజీవి
రేయ్ చిత్రం ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుకకు చిరంజీవిని ముఖ్య అతిథిగా పిలచేందుకు దర్శకుడు వైవిఎస్ చౌదరి ప్లాన్ చేస్తున్నారు.

రామ్ చరణ్
సాయి ధరమ్ తేజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ర్యాలీని రామ్ చరణ్ జెండా ఊపి ప్రారంభించబోతున్నారు.


Click it and Unblock the Notifications











