»   »  వరుసగా ‘మెగా’ ఈవెంట్స్, ఫ్యాన్స్‌కు పండగే...

వరుసగా ‘మెగా’ ఈవెంట్స్, ఫ్యాన్స్‌కు పండగే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ అభిమానులకు శుభవార్త. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా మూడు మెగా ఫ్యామిలీకి చెందిన వేడుకలు వరుసగా జరుగబోతున్నాయి. దీంతో అభిమానులంతా అక్టోబర్ ఫస్ట్ వీక్‌‌ను మెగా ఫెస్టివల్ వీక్ అని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆయా వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు సంసిద్ధం అవుతున్నారు.

Mega Family Festivals in line

అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య స్మారక అవార్డు సెర్మనీ జరుగబోతోంది. ఈ సంవత్సరం ఈ అవార్డును ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను ఎంపిక చేసారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. చిరంజీవి చేతుల మీదుగానే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అవార్డు అందుకోబోతున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరు కాబోతున్నారు.


ఆ తర్వాతి రోజు, అంటే అక్టోబర్ 2న అభిమానులకు మరింత సంతోషకరమైన రోజు. ఈ రోజు వరుణ్ తేజ్ నటించిన ‘కంచె' చిత్రం విడుదల కాబోతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన తొలి తెలుగు సినిమా ఇది.


Mega Family Festivals in line

అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమా ఆడియో వేడుక జరుగబోతోంది. హైదరాబాద్ లో ఈ వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు కూడా చిరంజీవి హాజరు కాబోతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘బ్రూస్ లీ' సినిమా అక్టోబర్ 16న విడుదల కాబోతోంది.

English summary
October first week is going to be mega festival time for mega fans. On October 1st, Allu Ramalingaiah Award ceremony will be held and this year the award will be presented to legendary singer SP Balasubramanyam. On very next day of 2nd, there going to be two occurrences for mega fans. First, Varun Tej's much awaited flick Kanche will have theatrical release and the other gala will be Ram Charan's Bruce Lee audio launch to be celebrated enormously in the evening in the presence of Chiranjeevi, other mega heroes and several Tollywood biggies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu