2012లో బాక్సాఫీసును షేక్ చేసిన మెగా ఫిల్మ్స్
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ నుంచి 2012 సంవత్సరంలో వందల చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని చిత్రాలు బారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సంవత్సరం వచ్చిన మెగా ఫ్యామిలీ చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. టాస్ 10 హిట్ చిత్రాలలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చిత్రాలే ఎక్కువగా ఉండటం గమనార్హం.
మెగా ఫ్యామిలీ హీరోస్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ గత సంవత్సరం నటించిన చిత్రాలు ప్లాపులుగా నిలిస్తే.... ఈ సంవత్సరం నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించాయి. తెలుగు సినిమా స్టామినా ఏమిటో నిరూపించిన చిత్రాల జాబితాలో ఈచిత్రాలు చోటు దక్కించుకోవడం గమనార్హం. మొత్తానికి 2012 సంవత్సరం మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చింది.

రామ్ చరణ్ తేజ్ లాస్ట్ మూవీ ఆరెంజ్. 2010లో విడుదలైన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలైంది. అయితే 2012లో వచ్చిన రచ్చ చిత్రం మాత్రం రామ్ చరణ్ కెరీర్లో రెండో పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.

గత కొన్ని సంవత్సరాలుగా హీరో అల్లు అర్జున్ వరుస పరాజయాలు చవి చూసాడు. ఆయన నటించిన వరుడు, వేదం, బద్రినాథ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఈసంవత్సరం ఆగస్టు 9న విడుదలైన ‘జులాయి' చిత్రం మాత్రం మంచి కలెక్షన్లు కురిపించి హిట్టయింది.

పులి, తీన్ మార్, పంజా చిత్రాలతో గత సంవత్సరం వరకు ప్లాపు సినిమాలు చవిచూసిన పవన్ కళ్యాణ్..... ఈ సంవత్సరం బాక్సాఫీసు వద్ద తన స్టామినా ఏమిటో చూపించారు. ఆయన నటించిన గబ్బర్ సింగ్ 81 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రను తిరగరాస్తూ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలించింది.

ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ మరో సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం కూడా మంచి విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది.

మెగా కుటుంబం నుంచి ఈ సంవత్సరం మరో హీరో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ‘రేయ్' చిత్రంలో నటిస్తున్నాడు. క్రిస్ మస్ సందర్భంగా ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











