Chiranjeevi: మెగా కుటుంబంలో సంబరాలు.. ఉత్సాహంగా మెగాస్టార్.. మెగా సిస్టర్స్ ఎంజాయ్
Recommended Video
మెగాస్టార్ చిరంజీవికి వాళ్ళమ్మ అంజనా దేవి అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిజీ లైఫ్‌లో కూడా అమ్మ కోసం సమయాన్ని కేటాయిస్తూ, ఆమెకు తన కష్టసుఖాలు చెప్పుకోవడం చిరంజీవి నైజం. అమ్మ ప్రేమ పొందటంలో ఆయన ఎప్పటికీ చిరజీవియే. అయితే నిన్న (జనవరి 29) అమ్మ అంజనా దేవి జన్మదినం కావడంతో చిరంజీవి ఫ్యామిలీ అంతా ఆమె జన్మదిన వేడుకలు నిర్వహించుకొని ఎంజాయ్ చేశారు. వివరాల్లోకి పోతే..
మెగా కుటుంబంలో సంబరాలు
జనవరి 29 చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా కుటుంబం అంతా సంబరాలు చేసుకుంది. తల్లితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో మునిగిపోయి ఎంతో ఆనందంగా కనిపించారు చిరంజీవి. ఆయనతో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా రోజంతా గడిపారు.

అమ్మతో చిరు సెల్ఫీ.. రోజంతా ఆమెతోనే
తన తల్లి అంజనా దేవి అంటే చిరనేజేవికి ప్రాణం. ఎన్నో సందర్భాల్లో తన తల్లిపై ఉన్న ప్రేమను తెలిపారు చిరంజీవి. ఈ నేపథ్యంలోనే తల్లి అంజనా దేవి పుట్టిన రోజున ఆమెతో రోజంతా గడిపి ఉల్లాసంగా కనిపించారు చిరు. ఆమెతో కేక్ కట్ చేయించి ఆప్యాయంగా కేక్ తినిపించారు. అదేవిధంగా ఆమెతో సెల్ఫీ కూడా దిగారు.
కొణిదెల నిహారిక పోస్ట్.. స్పెషల్ విషెస్
చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ పుట్టిన రోజు సంబరాల్లో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, పెద్ద కూతురు సుస్మిత, నిహారిక లతో పాటు మెగా సిస్టర్స్ పాల్గొన్నారు. ఈ పుట్టిన రోజు వేడుక ఫోటోలను నిహారిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ బామ్మకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగా 152.. చిరంజీవి సరసన త్రిష
ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి తన 152వ సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన సీనియర్ బ్యూటీ త్రిష నటిస్తుండటం విశేషం.

మెగాస్టార్- కొరటాల కాంబో.. సినిమా నేపథ్యం
షూటింగ్ మొదలుకాక ముందు నుంచే ఈ మెగా 152పై అంచనాలు మిన్నంటాయి. మెగాస్టార్- కొరటాల కాంబోలో సినిమా చూడాలని మహా ఆతృతగా ఉన్నారు ఆడియన్స్. దేవాలయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ''గోవింద ఆచార్య'' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా టాక్. అతిత్వరలో ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











