అభిమాని సంతాప సభుకు మెగా హీరోలు
హైదరాబాద్: బెంగులూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు అక్టోబర్ 30న అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలో కర్నాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె వెంకటేష్ యాదవ్‌తో పాటు ఆయన సోదరి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
వెంకటేష్ యాదవ్ సంతాప సభను డిసెంబర్ 6వ తేదీన బెంగుళూరులోని రవీంద్రభారతిలో మధ్యాహ్నం 12.45 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగా హీరోలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరెవరు హాజరవుతారు అనేదానిపై కచ్చితమైన సమాచారం లేదు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు, కర్నాటక నుంచి భారీగా అభిమానులు తరలి రాబోతున్నారు. ఈ మేరకు అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా అభిమాన సంఘాలు చరిత్రలో ఈ ఘటన అత్యంత బాధాకరమైన, విషాదకరమైన సంఘటనగా పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల సహాయం అందించారు. మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షల చెక్కు అందించారు. పవన్ కళ్యాణ్ కూడా వెంకటేష్ యాదవ్ కుటుంబానికి రూ. 7 లక్షల సాయం అందించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











