మెగా ఫ్యామిలీ మెగా సంబరం.. అంతా ఒక్కచోటకు ఎందుకు చేరారంటే

Recommended Video

Mega Family Young Stars Get Together Pics Goes Viral || Filmibeat Telugu

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మనసుకు హత్తుకునే ఓ మెసేజ్ పెట్టి ఆకట్టుకున్నారు. మనిషి జీవితంలో కుటుంబం, స్నేహితుల విలువ వెలకట్టరానిదని ఈ మెసేజ్ ద్వారా తెలిపారు చెర్రీ. ఈ మేరకు తన చెల్లెల్లు కొణిదెల శ్రీజ, నిహారిక లతో పాటు కుటుంబం అందరితో కలిసి జాలీగా గడిపిన కొన్ని పిక్స్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగా కుటుంబం.. సిల్వర్ స్క్రీన్ హంగామా

మెగా కుటుంబం.. సిల్వర్ స్క్రీన్ హంగామా

మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ రోజురోజుకూ మరింత పెద్దదవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయమవుతూ టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరోల సంఖ్యను అమాంతం పెంచేస్తున్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల వారసత్వాన్ని కొనసాగిస్తూ రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, కళ్యాణ్ దేవ్ అందరూ సిల్వర్ స్క్రీన్ హంగామా చేస్తున్నారు.

సండే కూడా పండగే.. మెగా సంబరం

సండే కూడా పండగే.. మెగా సంబరం

మెగా ఫ్యామిలీ అంతా కలసికట్టుగా ఉంటుంది. పెద్ద కుటుంబం కావడంతో ఎంత బిజీగా ఉన్నా కూడా పండుగ రోజు, సండే, హాలీడే ఇలా వీలు కూడినప్పుడల్లా కలుసుకుంటూనే ఉంటారు. అంతా ఒక్క చోట చేరి తెగ హుంగామా చేస్తుంటారు. అదే కోవలో ఈ ఆదివారం కూడా మెగా హీరోలంద‌రూ ఒక్క చోట చేరి తెగ సంద‌డి చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో దర్శనమీయడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతూ లైకులు వర్షం కురిపిస్తున్నారు.

మనసుకు హత్తుకునే రామ్ చరణ్ మెసేజ్

ఒక్క వైష్ణవ్ తేజ్ తప్ప రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇలా అందరూ ఈ పిక్స్ లో తెగ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. అయితే ఈ పిక్స్‌ని తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన రామ్ చరణ్..''దగ్గరి స్నేహితులు, కుటుంబంతో గడపడంలో ఉన్న హ్యాపీనెస్ మరెక్కడా లభించదు. మనిషి జీవితంలో ఆనందానికి ముఖ్యమైన సోర్స్ అదే'' అని పేర్కొన్నాడు. స్నేహితులు, కుటుంబ వివాలు తెలియజేసేలా చెర్రీ పెట్టిన ఈ మెసేజ్ నెటిజన్ల మనసును హత్తుకుంటోంది.

మెగా హీరోలు.. బిజీ బిజీ

మెగా హీరోలు.. బిజీ బిజీ

ప్రస్తుతం మెగా హీరోలంతా తమ తమ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ RRR షూటింగ్ లో బిజీగా ఉండగా.. వరుణ్ తేజ్ వాల్మీకి, సాయి ధరమ్ తేజ్- మారుతి ప్రాజెక్టులో, వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు చెర్రీ భార్య ఉపాసన సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతోంది. ఇంత బిజీలో కూడా మెగా ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్ లో చూసి తెగ సంబరపడుతున్నారు ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X