మెగా సందడి లేకుండానే ‘అత్తారింటికి దారేది’?
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో గ్రాండ్‌గా జరిపేందుకు ఏర్పాట్లు చేసారు. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల్లో ఏ హీరో ఆడియో వేడుక జరిగినా....మెగా హీరోల్లో కనీసం సగం మంది హాజరై అభిమానులకు కనువిందు చేస్తుంటారు.
అయితే ఈ రోజు జరిగే 'అత్తారింటికి దారేది' ఆడియో వేడుకలో మాత్రం మెగా సందడి ఉండబోదని ఫిల్మ్ నగర్ టాక్. మెగా ఫ్యామిలీ నుంచి చీఫ్ గెస్టుగా ఎవరూ హాజరు కావడం లేదని సమాచారం అందుతోంది. ప్రస్తుతం మెగా హీరోల్లో టాప్ లో ఉన్నది పవన్ కళ్యాణే....ఈ నేపథ్యంలో ఏ ఇతర మెగా హీరోలు వచ్చినా వారికి అక్కడ దక్కే ప్రాధాన్యం తక్కువే. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఎవరినీ ఈ వేడుకకు చీఫ్ గెస్టుగా ఆహ్వానించలేదట.
గతంలో ఇతర మెగా హీరోల ఆడియో వేడుకలు జరిగినప్పుడు అభిమానులంతా ఆ హీరోను వదిలేసి...పవన్ కళ్యాన్ రావాలంటూ గొడవ చేసిన సందర్భాలు అనేకం. ఈ పరిణామాలు కూడా 'అత్తారింటికి దారేది' ఆడియో వేడుకలో మెగా సందడి మాయమవడానికి కారణం అయి ఉండవచ్చే వాదన వినిపిస్తోంది.
అత్తారింటికి దారేది చిత్రాన్ని ఆగస్టు 7న సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లు. నదియా, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, అలీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లోకనిపించనున్నారు. సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











