6ఏళ్ళ పాటు మెగా ఫ్యామిలికే ఫిక్స్ అయిపోయిన గ్రేట్ మెగా డైరెక్టర్...!?
అల్లు అర్జున్ తో 'బద్రినాథ్" సినిమా తెరకెక్కిస్తోన్న దర్శకుడు వివి వినాయక్ వరుసగా మెగా కాంపౌండ్ లోనే మరో మూడు సినిమాలు చేయబోతున్నాడు. వాటిల్లో 'బద్రినాథ్" అయిపోయిన వెంటనే, చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే చిత్రం వుండబోతోంది. ఈ విషయాన్ని వినాయక్ మొన్నీమధ్యనే ఓ సందర్భంలో ప్రయకటించేసిన సంగతి తెలిసిందే...వినాయక్, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన 'ఠాగూర్" సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా వినాయక్ మెగా ఫ్యామిలో చోటు సంపాదించుకొన్నారు. ఒక్క దెబ్బకి మూడు పిట్టలన్నట్టు దాని తర్వాత అల్లు అర్జున్ తో 'బద్రినాథ్" నుండి పవన్ కళ్యాణ్ సినిమా వరుకూ లక్కీ చాన్స్ లు కొట్టేశారు.
ఆ సినిమా తర్వాత గానీ, ఒక వేళ చిరంజీవి సినిమా లేటయినాగానీ, చరణ్ తో వినాయక్ సినిమా ముందుగా సెట్స్ పైకి వచ్చే అవకాశాలున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాకి కమిట్ అయిన వినాయక్, ఆ ప్రాజెక్ట్ ని కూడా వీలైనంత త్వరగా చేయాలని అనుకుంటున్నాడట. ఎంత స్పీడ్ గా చేసినా, ఒక్కో ప్రాజెక్ట్ కీ కనీసం ఆర్నెళ్ళు టైమ్ పడ్తుంది కాబట్టి, తక్కువలో తక్కువ రెండేళ్ళపాటు మెగా కాంపౌండ్ లో వినాయక్ ఫిక్సయిపోవాల్సిందేనన్నమాట.


Click it and Unblock the Notifications











