‘నాయక్’ ఆడియో వేడుకలో మెగా ఫ్యామిలీషో
హైదరాబాద్: వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం 'నాయక్'. 'ది లీడర్' అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రంలో కాజల్, అమలా పాల్ హీరోయిన్ గా చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య. సంక్రాంతి కానుకగా జవవరి 9, 2013న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం ఆడియో నవంబర్ 25న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవుతోందని, పవన్ కళ్యాణ్ తప్పకుండా హాజరయ్యేలా ఈ ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
రచ్చ ఆడియో వేడుకకు పవన్, గబ్బర్ సింగ్ ఆడియోకు రామ్ చరణ్ గైర్హాజరవ్వడంతో... మెగా కుటంబంలో విబేధాలు అంటూ పుకార్లు షికార్లు చేసాయి. ఈ సారి అలా జరుగకుండా ఉండేందుకు నాయక్ ఆడియో వేడుకలో మెగా ఫ్యామిలీషో ఇచ్చి అభిమానులకు కోరిక తీర్చనున్నారు.
ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రాహుల్‌దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.
ఆడియో ట్రాక్ లిస్ట్
1. నేనంటే అంతా....
2. దేవుడైనా ప్రేమకి...
3. నాయక్ టైటిల్ సాంగ్
4. ప్రపంచంలో...
5. చిన్నా పెద్దా..
6. శుభలేఖ రాసుకున్నా(రీమిక్స్)


Click it and Unblock the Notifications











