సమంతపై మెగా హీరో క్రష్: చైతూ లేకుంటే ట్రై చేసేవాడట!
సాయి ధరమ్ తేజ్ సమంతపై క్రష్ బయట పెట్టారు. చైతూ లేకుంటే తాను ఆమెను ట్రై చేసేవాడిని అన్నారు.
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ సమంత అంటే తనకు ఎంతో ఇష్టమని, నాగ చైతన్య అడ్డు లేకుంటే సమంతను తాను ప్రేమించే వాడిని, ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించే వాడిని అని మెగా మేనల్లుడు వ్యాఖ్యానించారు.
నక్షత్రం మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సాయి ధరమ్ తేజ్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సెంట్రల్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ బెటాలియన్‌తో సరదాగా ముచ్చటించారు.

సమంతపై కోరిక
ఈ సందర్భంగా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అని ప్రశ్నించగా... సమంత అంటే తనకు చాలా ఇష్టమని, ఎంతో మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, నాగ చైతన్య-సమంత మధ్య లవ్ రిలేషన్ లేకుంటే తాను ట్రై చేసే వాడిని అని సాయి ధరమ్ తేజ్ అన్నారు.

భగత్ సింగ్
తనకు ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి తర్వాత తనకు నచ్చిన హీరోలు రవితేజ, ప్రభాస్ అని తెలిపారు. రవితేజ ఎనర్జీ లెవెల్స్ బావుంటాయని, మల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే రవితేజతో చేస్తానన్నారు. తన కో స్టార్లలో రెజీనా అంటే ఇష్టమన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్
‘మీరు ఎప్పుడైనా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డారా?' అని ప్రశ్నించగా... తాను చాలా అరుదుగా మద్యం తాగుతానని, అది కూడా ఫ్రెండ్స్ తో కలసి ఇంట్లోనే తాగుతానని సమాధానం ఇచ్చారు.

ఫస్ట్ వార్నింగ్
రాంగ్ రూట్ లో వెళ్లి పట్టుబడ్డ సందర్భాలు కూడా చాలా తక్కువ అని, ఒకసారి దొరికితే తాను పలానా వ్యక్తిని అని తెలియడంతో ‘ఫస్ట్ వార్నింగ్' అని చెప్పి పంపించారంటూ సాయిధరమ్ తేజ్ గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











