twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయిధరమ్ పరువు తీయకు.. చిరంజీవి మాకు చాలు.. సినిమాలు మానేయ్..

    By Rajababu
    |

    Recommended Video

    Sai Dharam Tej Faced Bad Situations

    సాయిధరమ్ తేజ్ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో ఎనర్జిటిక్‌ అని పేరు తెచ్చుకొన్నారు. కెరీర్ ఆరంభంలో సాయిధరమ్‌ను ఫెయిల్యూర్స్ పలకరించాయి. ఆ తర్వాత సక్సెస్‌లు వెంట నిలిచాయి. తాజాగా ఇంటిలిజెంట్ చిత్రం కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ చానెల్‌తో సాయిధరమ్ తేజ్ మాట్లాడారు. ఆయన ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ఆయన పంచుకొన్నారు. సాయిధరమ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

    కెరీర్ ఆరంభంలో సమస్యలు

    కెరీర్ ఆరంభంలో సమస్యలు

    నా కెరీర్ ఆరంభంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. హీరోను కావడానికి నేను నా ఫ్యామిలీ పేరును వాడుకోవద్దను కొన్నాను. ఆడిషన్స్ కోసం వెళ్లాను. నేను మెగా ఫ్యామిలీకి చెందిన వాడిని అని నేను చెప్పుకోలేదు. కేరింత ఆడిషన్‌కు వెళితే దిల్ రాజు నాకు పిల్ల నీవు లేని జీవితం సినిమా అవకాశం ఇచ్చారు.

    మెగా ఫ్యామిలీ పేరు వాడుకోలేదు

    మెగా ఫ్యామిలీ పేరు వాడుకోలేదు

    టాలీవుడ్‌లో చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు బ్రాండ్ ఉంది. దానిని పెద్దగా వాడుకోలేదు. చిరంజీవి, పవన్ ఆశీస్సులతో నేను నిలదొక్కుకున్నాను. నేనెవరో తెలియకుండానే నాకు మొదటి సినిమా అవకాశాన్ని వైవీఎస్ చౌదరీ ఇచ్చాడు. నేనెప్పుడు మెగా ఫ్యామిలీ పేరును పెద్దగా ఉపయోగించుకోలేదు.

    ఐరెన్ లెగ్ అని బ్రాండ్

    ఐరెన్ లెగ్ అని బ్రాండ్

    రేయ్ సినిమా ఆగిపోవడంతో నాకు అన్ లక్కీ ఫెలో అని బ్రాండ్ వేశారు. మా సినిమా షూట్ ముగిసే సమయంలో శ్రీహరి గారు చనిపోయారు. అప్పుడు మళ్లీ సినిమా అంతా రీషూట్ చేశాం. సాధారణంగా హీరోయిన్లకు ఐరెన్ లెగ్ అంటారు. కానీ నాకు ఆ పేరు వచ్చింది.

     రేయ్ ఆగిపోవడానికి

    రేయ్ ఆగిపోవడానికి

    రేయ్ సినిమా ఆగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ విషయంలో ఎవరినీ తప్పు పట్టకూడదు. పవన్, చిరంజీవి సపోర్ట్ ఉన్నప్పటికీ.. ఆర్థిక సమస్యలు వెంటాడాయి. లేటు కావడంతో కథ కూడా అప్‌డేట్ అయింది.

     అమ్మ ధైర్యాన్ని

    అమ్మ ధైర్యాన్ని

    సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తే మనోనిబ్బరంగా ఎలా ఉండాలో అమ్మ నేర్పింది. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మొదట స్నేహితుల నుంచే మొట్టికాయలు పడుతాయి. కెరీర్ మొదట్లోనే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో నాపై ఒత్తిడి పెరిగింది. దాంతో ఇక సక్సెస్ కోసమే నేను ప్రయత్నించాను. అమ్మ, తమ్ముడు ధైర్యాన్ని ఇచ్చారు. మామయ్యాలు అండగా నిలిచారు.

     పెళ్లి చేసుకోమని పోరు

    పెళ్లి చేసుకోమని పోరు

    అమ్మ పెళ్లి చేసుకోమ్మని పోరు పెడుతున్నది. కానీ నేను చేసుకోలేదని చెప్పాను. నా చిన్నతనం, యుక్త వయస్సులో నేను కోల్పోయిన క్షణాలను అనుభవించాలి. అమ్మతో గడుపలేకపోయిన సమయాన్ని ఇప్పడు నేను అనుభవించాలి. అవన్నీ తీరిన తర్వాతనే నేను పెళ్లి చేసుకోంటాను అని చెప్పాను.

     మా కోసం అమ్మ త్యాగం చేసింది

    మా కోసం అమ్మ త్యాగం చేసింది

    నా చిన్నతనంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. మా అమ్మ కెరీర్‌ను మా కోసం చాలా త్యాగం చేసింది. మేము ఎక్కడ చెడిపోతామో అని భయంతో మాకోసమే తన సమయాన్ని కేటాయించింది. అందుకే నాకు మా అమ్మ అంటే ఇష్టం. అమ్మతో గర్ల్‌ఫ్రెండ్ గురించి చెబుతాను. పార్టీలో తాగే విషయాన్ని చెబుతాను.

     డబ్బులు లేకుండా బతికా

    డబ్బులు లేకుండా బతికా

    నేను డిగ్రీ చదువుకునేటప్పుడే ఉద్యోగం చేసేవాడిని. సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పడితే నష్టం వచ్చింది. ఓదశలో డబ్బులు లేకుండా బతికాను. రేయ్ సినిమా ఆగిపోయింది. ప్రతీ ఏడాది సినిమా హిట్ అవుతుంది.. మన జీవితం మారిపోతుంది అని అమ్మతో అనే వాడిని.

     ధైర్యాన్ని కోల్పోలేదు

    ధైర్యాన్ని కోల్పోలేదు

    జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోలేదు. నేనప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకొంటాను అని నమ్మకం ఉండేది. అందుకే నేను ఎప్పుడు జీవితం ఏమౌతుందో అని బాధపడలేదు. నా కజిన్స్ అందరూ నన్ను ఓ బ్రదర్‌గా చూసుకొన్నారు.

     పవన్‌కు ముందు చెప్పాను

    పవన్‌కు ముందు చెప్పాను

    నాకు యాక్టింగ్ చేయాలని ఉంది అని మొట్టమొదటిసారి చెప్పింది పవన్ కల్యాణ్ గారికి. ఆ తర్వాత చిరంజీవికి చెప్పాను. దాంతో హీరో కావాలంటే ఏమి చేయాలో నీకు తెలుసుగా అని వారు అన్నారు. ఆ తర్వాత మా అమ్మకు చెప్పాను. అప్పుడు ఎంబీఏ పూర్తి చేయి. ఆ తర్వాత యాక్టింగ్ చేద్దువుగాని అని అమ్మ అన్నారు.

    సినిమా ఆడకపోతే

    సినిమా ఆడకపోతే

    పిల్లా నీవు లేని జీవితం సినిమా ఆడకపోతే సినిమాలు మానేద్దామని అనుకొన్నాను. ఆ సమయంలో ఓ ఫ్యాన్ ఫోన్ చేసి క్లాస్ పీకారు. నీవు చేసింది చాలూ. నీవు సినిమాలు చేసి ఉద్దరించి చాలూ. మాకు చిరంజీవి ఉన్నారు. సినిమాలు ఆపేయ్ అన్నాడు. దాంతో నేను ఓ సినిమా చేస్తున్నాను. ఆ తర్వాత చూస్తాను అని అన్నారు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత అతను సారీ చెప్పాడు.

    English summary
    Sai Dharam Tej one of the energitic heros in Tollywood. He face bad situation in his early career.But he got succes after few films. After Intelligent flop, Sai Dharam Tej speak to a youtube channel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X