»   » ఆపద్భాంధవుడు: చిరు సహాయంపై ఫ్యాన్స్ స్పందన(ఫోటో)

ఆపద్భాంధవుడు: చిరు సహాయంపై ఫ్యాన్స్ స్పందన(ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బెంగులూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్‌ అనే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు అక్టోబర్ 30న అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలో కర్నాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె వెంకటేష్ యాదవ్‌తో పాటు ఆయన సోదరి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చిరంజీవి ఆయన కుటుంబానికి రూ. 5 లక్షల సహాయం అందించారు. మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా వారి ఇంటికి చేరుకుని రూ. 5 లక్షల చెక్కు అందించారు. అభిమాని కుటుంబానికి సహాయం చేయడంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారని అన్నారు.

Mega fans about Chiranjeevi help

చిరంజీవి సహాయం చేయడంపై పలువురు అభిమానులు ఉద్వేంగంగా స్పందించారు. కేవలం సినిమాలో మాత్రమే కాదని, రియల్ లైఫ్‌లో ఆయన ఆపద్భాంధవుడు అని నిరూపించుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సేవా భావం వల్లనే రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆయనకు లెక్కలేనన్ని అభిమానులు ఏర్పడ్డారని అంటున్నారు.

రాజకీయాల్లోకి రాకముందు నుంచే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు లాంటి సేవా సంస్థలతో పాటు, అనేక సందర్భాల్లో తనకు చేతనైనంత సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారని....ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఉద్దేశ్యం కూడా తన సేవా పరిధిని విస్తరించడానికే అని పలువురు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary

 Chiranjeevi Garu Gave 5 lakhs DD to Banglore mega fans president Venkatesh Yadav family. He passed away in Mahaboobnagar Volvo accident last week. Nagababu met their family and hand over it to them today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu