twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘తుఫాన్’ మైనస్ పాయింట్లపై ఫ్యాన్స్ ఇలా..!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగు వెర్షన్ 'తుఫాన్' పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. తుఫాన్ చిత్రం విషయంలో ప్రేక్షకులు, అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత వరకు పాజిటివ్ టాక్ ఉన్నా...ఎక్కువ శాతం నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.

    కొందరు అభిమానులు హిందీ వెర్షన్ 'జంజీర్'తో పాటు, తెలుగు వెర్షన్ 'తుఫాన్' మూవీ చూసారు. వారి అభిప్రాయం ప్రకారం......'జంజీర్' చిత్రం పర్‌ఫెక్టుగా ఉందని, తెలుగు వెర్షన్ 'తుఫాన్' విషయానికొస్తే అనేక లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని స్వయంగా ఒప్పుకుంటున్నారు.

    ముఖ్యంగా తెలుగు వెర్షన్లో సాంగ్స్ ప్లేస్ మెంటు సరిగా లేదని...అందుకే సినిమాపై ఇలా నెగెటివ్ టాక్ వచ్చిందని అంటున్నారు. హిందీ వెర్షన్లో లమ్హా తేరా(ప్రేమించా సాంగ్) ఫస్ట్ ఆఫ్ లో చరణ్ బర్త్‌డే అపుడు ఫ్లాష్ బ్యాక్ చెప్పినపుడు రావడం వల్ల ఫర్ ఫెక్టుగా సింక్ అయిందని, కానీ తెలుగులో అలా లేదని అంటున్నారు.

    తెలుగు వెర్షన్లో పార్టీకి వెళ్దామా అన్నపుడు ముంబైకి హీరో సాంగ్ పెట్టారు. కానీ హిందీ వెర్షన్లో అపుడు సంజయ్ బాబా సాంగ్ రావడం ఇద్దరి ఫెండ్‌షిప్ కి సెట్టయ్యే విధంగా ఉందని, హిందీలో ముంబైకా హీరో సాంగ్ సినిమా ఎండింగులో డ్రగ్ మాఫియా చూపించే ముందు రావడం బాగుందని అంటున్నారు.

    సినిమా వివరాల్లోకి వెళితే...1975లో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏసిపీ విజయ్ ఖన్నా పాత్రలో నటించాడు. షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించగా, మోనా డార్లింగ్ పాత్రలో నటించింది. తనికెళ్ల భరణి, దేవ్ గిల్ కీలకమైన పాత్రలు పోషించారు.

    రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

    English summary
    Mega fans said that, Zanjer is Perfect, but telugu version Toofan movie have some minus points. Zanjeer directed by Apoorva Lakhia, shot simultaneously in Hindi and Telugu. The film marks the Bollywood debut of Tollywood actor Ram Charan in the lead role along with Priyanka Chopra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X