»   » డబ్బు వసూలు చేయడం లేదు: మెగాఫ్యాన్స్ వివరణ

డబ్బు వసూలు చేయడం లేదు: మెగాఫ్యాన్స్ వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం మెగా అభిమానులు డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ వారికి వార్నింగ్ ఇచ్చారనే వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన మెగా అభిమానులు ఇటీవల గుంటూరు సమావేశం అయినప్పటి నుండి ఈ వార్తలు గుప్పు మన్నాయి.

అయితే ఈ వార్తలను చిరంజీవి అభిమాన సంఘాలు ఖండించాయి. చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం ఎలాంటి చందాలు వసూలు చేయడం లేదని వారు స్పష్టం చేసారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులకు సూచించారు. ఈ వార్తల విషయంలో ఓ క్లారిటీ రావడంతో మెగా అభిమానుల్లో అయోమయం వీడింది.

చిరంజీవి 150వ సినిమా...
ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఆయన పుట్టిన రోజున అంటే ఆగస్టు 22 న ఈ చిత్రం ప్రారంభం జరగనుందని సమాచారం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన 150 వ చిత్రం గురించి ఎన్నో కథలు,కథనాలు మీడియాలో వచ్చాయి...వస్తూనే ఉన్నాయి. వేటికీ చిరంజీవి అవుననలేదు...కాదనలేదు. ఆయన మాత్రం తన శరీరాన్ని సినిమాకు తగినట్లు మార్చుకునే పనిలో పడిపోయారు. అదే స్పీడులో స్క్రిప్టుని సైతం ఓకే చేసి రోజూ ఆ స్క్రిప్టు పై కూర్చుంటున్నట్లు సమాచారం.

 Mega Fans Association Condemns Rumours

అందుతున్న సమాచారం ప్రకారం... చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తారి. అందుకే 'ఆటోజానీ' టైటిల్‌ను పూరి రిజిస్టర్‌ చేయించారు. ఈ కథను ప్రముఖ రచయిత బీవీఎస్‌ రవి అందిస్తారు. గత కొంతకాలంగా ఈ కథపై చిరు, పూరి, రవి కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు కథ పూర్తిస్థాయిలో సిద్ధమైందట.

ఇక మెగాస్టార్‌ చిరంజీవి 60వ జన్మదిన వేడుకలను ఆగస్టు 22న ఘనంగా నిర్వహించాలని అఖిల భారత చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు స్వామినాయుడు చెప్పారు. చిరంజీవి యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అమిరిశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం గుంటూరు జిల్లా చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో చిరంజీవి యువత, అభిమాన సంఘాల ముఖ్య నేతల సమావేశం జరిగింది.

ఆగస్టు 2న హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల ముఖ్య పట్టణాల్లో చిరంజీవి జన్మదిన వేడుకలను ప్రారంభించాలని నిర్ణయించారు. జిల్లాస్థాయిలో, రాష్ట్రస్థాయిలో పాటలు, నృత్య పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

English summary
Mega star Chiranjeevi fans Association Condemns Rumours. From a couple of days, it's being spread on some websites that AP and Telangana Mega Fans are collected donations to organise Megastar Chiranjeevi's birthday events on August 22nd.
Please Wait while comments are loading...