twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డీజే ఆఫీసుపై దాడి: మెగా అభిమానుల పనేనా?

    చిరంజీవి సినిమా రికార్డు పడిపోయింది అని నోటిమాటగా చెప్పి మరీ మెగాస్టార్ ని తక్కువ చేయాలని చూస్తే ఊరుకోబోమంటూ డీజే ఆఫీస్ మీదే దాడికి దిగారు.

    |

    డివైడ్ టాక్‌తో ప్రారంభమైన దువ్వాడ జగన్నాథం ప్రస్థానం ఇప్పడు బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకొన్నది అనే ప్రచారం జోరుగా సాగుతున్నది. డీజే కలెక్షన్లు నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను తుడిచిపెడుతున్నదని దర్శకుడు హరీశ్ శంకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. డీజే థ్యాంక్యూ మీట్‌లో మా చిత్రమేంటో రెవెన్యూ మాత్రమే మాట్లాడుతుందని హరీశ్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కలెక్షన్లు వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక మూడు రోజుల క్రితం హరీష్ శంకర్ కూదా ఒక రేజి లో మాట్లాడాదు.

    డీజే దర్శకుడు చేసిన హడావిడి

    డీజే దర్శకుడు చేసిన హడావిడి

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం టాలీవుడ్‌లో అత్యధికంగా వసూలు చేసిన చిత్రాల జాబితాలో రెండు నుంచి ఐదో స్థానంలో ఎక్కడ ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది అని హరీశ్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. డీజే దర్శకుడు చేసిన హడావిడి బట్టి చూస్తుంటే అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఖైదీ నంబర్ 150 చిత్రం

    ఖైదీ నంబర్ 150 చిత్రం

    బాహుబలి తర్వాత మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రందే ఓ రికార్డు. అయితే దర్శకుడు హరీశ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే చిరంజీవి రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయిందని అనుకోవాల్సి వచ్చింది. కానీ ఇందులో ఏదినిజం??? ఏ ఆధారాలూ లేకుండా ఒక రికార్ద్ బద్దలైందని చెప్పేసుకుంటే ఎలా?? సరిగ్గా ఇక్కడే మెగా అభిమానులు రెచ్చిపోయారు...

    వాళ్ళంతా ఒకటే కదా

    వాళ్ళంతా ఒకటే కదా

    మెగా అభిమానులు అంటే అల్లు అర్జున్ అభిమానులు కాదా? వాళ్ళంతా ఒకటే కదా అంటారా... కానీ ఇక్కడ లెక్క తప్పింది. చిరంజీవి సినిమా రికార్డు పడిపోయింది అని నోటిమాటగా చెప్పి మరీ మెగాస్టార్ ని తక్కువ చేయాలని చూస్తే ఊరుకోబోమంటూ డీజే ఆఫీస్ మీదే దాడికి దిగారు.

    ఆధారాలు చూపించాలని

    ఆధారాలు చూపించాలని

    డీజే కలెక్షన్లకు సంబంధించిన ఆధారాలు చూపించాలని హైదరాబాద్‌‌లోని సాగర్ సొసైటీలో ఉన్న డీజే ఆఫీసు ముందు నినాదాలు చేశారు. మెగా అభిమానుల నుంచి ఊహించని ఈ సంఘటనతో నిర్మాత దిల్‌రాజ్ షాక్ అయ్యారట. ఈ నేపథ్యంలో దిల్‌రాజు కార్యాలయం వద్ద భద్రత ఏర్పాటు చేశారట.

    హరీష్ శంకర్

    హరీష్ శంకర్

    డీజే కలెక్షన్లలో తప్పుడు లెక్కలు ఉన్నాయని కొన్ని వెబ్‌సైట్లలో వచ్చిన వార్తలపై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ.. నైజాం ఏరియాలో డీజే రూ. 20 కోట్ల కలెక్షన్లు సాధించిందని, ఇది తప్పని ఎవరైనా నిరూపించగలరా అని ఓపెన్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే కదా. ఇందుకే ఒక మాట అనే ముందు వెనకా ముందు చూస్కొని అనాలి మరి.

    English summary
    Mega fans who are upset with the collections of DJ said to have lost cool after director Harish Shankar openly challenged media to prove the numbers wrong. Few Chiru fans supporting Chiranjeevi and Ram Charan have surrounded DJ office in Sagar Society
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X