Boycott Bhairavam: బాయ్‌కాట్ భైరవం.. చిరంజీవి, రాంచరణ్‌పై డైరెక్టర్ నోటి దురుసు.. మెగా ఫ్యాన్స్ మండిపాటు!

యువ హీరోలు నారా రోహిత్, మనోజ్ మంచు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై తదితరులు నటించిన చిత్రం భైరవం. తమిళ చిత్రం గరుడన్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కేకే రాధామోహన్ నిర్మించారు. డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో చిరంజీవి, రాంచరణ్‌ను కించపరిచేలా ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల సోషల్ మీడియాలో చేసిన పోస్టు అత్యంత వివాదంగా మారింది. ఆ పోస్టు తాజాగా సోషల్ మీడియాలో బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దాంతో ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. ఈ వివాదం వెనుక అసలు కారణం ఏమిటంటే?

భైరవం దర్శకుడు విజయ్ కనకమేడల తన సోషల్ మీడియా అకౌంట్‌లో చిరంజీవి, రాంచరణ్ ఫోటోను మార్పింగ్ చేసి ఓ ఫోటోను పోస్టు చేశాడు. హిందీలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ నటించిన పా సినిమా పోస్టర్‌ను మార్పింగ్ చేసి.. దానికి చిరంజీవి, రాంచరణ్ తలలు అతికించారు. ఆ పోస్టర్‌కు ఛా అనే టైటిల్ పెట్టాడు. ఆ ఫోటో కింద సామాజిక న్యాయం సమర్పించు ఛా అంటూ తన నోటి దురుసును బయటపెట్టుకొన్నారు.

Boycott Bhairavam

అయితే భైరవం సినిమా ప్రమోషన్స్‌లో ఓ పక్క జోరుగా జరుగుతుంటే.. మరో పక్క మెగా ఫ్యాన్స్ ఈ పోస్టర్‌ను బయటపెట్టి విజయ్ కనకమేడలపై బూతులు అందుకొన్నారు. మెగా హీరోలను ఇలా కించపరుస్తావా? అంటూ సోషల్ మీడియాలో మాటల దాడికి దిగారు. అంతేకాకుండా ఆయన దర్శకత్వం వహించిన భైరవం సినిమాను బహిష్కరించాలని మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు.

సోషల్ మీడియాలో Boycott Bhairavam ట్యాగ్ ట్రెండింగ్ కావడంతో విజయ్ కనకమేడల షాక్ గురయ్యాడు. తన తప్పు తెలుసుకొన్న ఆయన తన అకౌంట్ హ్యాక్ అయిందంటూ ఓ పోస్ట్ పెట్టారు. నాకు మెగా హీరోలంటే చాలా గౌరవం ఉంది. నా అకౌంట్‌ను నా ప్రమేయం లేకుండా ఎవరో ఈ పోస్టు పెట్టారు. ముమ్మాటికి ఎవరో హ్యాక్ చేశారు అంటూ సుదీర్ఘమైన పోస్టును సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Boycott Bhairavam

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకు నేను పని చేశాను. అప్పుడు నన్ను కళ్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. అదే సమయంలో సాయి ధరమ్ తేజ్ గారిని కూడా పరిచయం చేసి మంచి కథ ఉంటే డైరెక్షన్ చేసుకో అన్నారు. తేజ్ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన నన్ను అన్నా అన్నా అని సంబోధిస్తారు. అలాంటిది నేను మెగా అభిమానులను ఎందుకు దూరం చేసుకుంటానండి. అందరిలాగే నేను కూడా చిరంజీవి గారి సినిమాలు చూసి, పవర్ స్టార్ గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను డైరెక్టర్ అవుదామని..! అటువంటిది నేనెందుకు వాళ్లను దూరం చేసుకుంటాను అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

Boycott Bhairavam
అయితే హ్యాకింగ్ అంటూ సొల్లు విషయాలు చెప్పకు. ఆ పోస్టు పెట్టి 14 ఏళ్లు అయింది. హ్యాక్ అయితే ఇన్ని ఏళ్లలో ఎప్పుడు ఫేస్‌బుక్ చెక్ చేసుకోలేదా? అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు. 'నీకు నోటి దూల పొగరు ఎక్కువ ఉన్నట్లుంది అందుకే అవసరంలేని విషయాలు మాట్లాడుతున్నావు అది 2011లో చిరంజీవి పైనైనా భైరవం ఫంక్షన్ లో నైనా ఇప్పటికీ నువ్వు ఎవరో కూడా ఎవరికీ తెలియదు ఇంకా నీది హ్యాక్ చేసారంటే అంతకంటే పెద్ద జోక్ వుండదు' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X