»   » ఇక నుంచి అక్టోబర్ 30 ‘మెగా ఫ్యాన్స్ డే’

ఇక నుంచి అక్టోబర్ 30 ‘మెగా ఫ్యాన్స్ డే’

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ప్రతి సంవత్సరం అక్టోబర్ 30వ తేదీని మెగా ఫ్యాన్స్ డేగా జరుపుకోవాలని మెగా కుటుంబ హీరోలకు చెందిన అన్ని అభిమాన సంఘాలు డిక్లేర్ చేసాయి. రవీంద్ర భారతిలో జరిగిన కర్నాటక చిరంజీవి యువత అధ్యుడు కొట్టె వెంకటేష్ యావద్ సంస్మరణ సభ సందర్భంగా మెగా అభిమాన సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

బెంగులూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్‌ అనే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు అక్టోబర్ 30న అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలో కర్నాటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె వెంకటేష్ యాదవ్‌తో పాటు ఆయన సోదరి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

ప్రతి సంవత్సరం 'మెగా ఫ్యాన్స్ డే' సందర్భంగా అన్ని ప్రాంతాల్లోని మెగా అభిమానులు రక్తదానం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక అభిమానికి ఇంత గౌరవం దక్కడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

వెంకటేష్ యావద్ కుటుంబానికి చిరంజీవితో పాటు, అభిమాన సంఘాలు కూడా ఆర్థిక సహాయం అందించాయి. వారి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని నాగబాబు స్వయంగా ప్రకటంచారు. వెంకటేష్ యాదవ్ లేని లోటు తీర్చలేదని రామ్ చరణ్ తదితరులు పేర్కొన్నారు.

English summary
Mega Fans Associations declared 30th October as ‘MEGA FANS DAY’. Mega Star Chiranjeevi’s hard core fan Kotte Venkatesh Yadav, president of Karnataka Mega Fans Association, and his sister Kotte Venkatesh Yadav died in the Volvo bus accident happened near Mehbubnagar on 30th October.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu