‘మెగా ప్రిన్స్’ వద్దంటూ నాగబాబుతో ఫ్యాన్స్ వాదన!
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి హీరోలుగా పరిచయం అయ్యే వారికి....ఏదో ఒక బిరుదు తగిలించడం ఆనవాయితీగా వస్తోంది. చిరంజీవి వారసత్వంతో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘పవర్ స్టార్' అయ్యాడు. ఆ తర్వాత చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ ‘స్టైలిష్ స్టార్'గా పాపులర్ అయ్యాడు. తర్వాత రామ్ చరణ్ ‘మోగా పవర్ స్టార్'గా చలామని అయ్యాడు.
ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్
తాజాగా మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌కు ‘మెగా ప్రిన్స్' బిరుదు ఇస్తూ ఆ మధ్య ఆడియో వేడుకలో చిరంజీవి స్వయంగా ప్రకటన చేసారు. ఈ రోజు విడుదలైన ‘ముకుంద' సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ‘మెగా ప్రిన్స్' అనే పేరును అభిమానులు ఇష్ట పడటం లేదని తెలుస్తోంది.

‘ముకుంద' విడుదల పురస్కరించుకుని ఇటీవల నాగబాబు మెగా అభిమానులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు తమ మనసులోని మాట బయట పెట్టారు. మెగా ప్రిన్స్ బిరుదు బాగోలేదని, ప్రిన్స్ పదం తొలగించాలని, ఇంకా ఏదైనా పెట్టాలని అంటున్నారు. అదే సమయంలో ఓ అభిమాని వరుణ్ తేజ్ కటౌట్‌కు సూటయ్యేలా ‘ఆరడుగుల బుల్లెట్' అని బిరుదు పెట్టాలని సూచించారు.
ముకుంద సినిమా విషయానికొస్తే...
ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.


Click it and Unblock the Notifications











