జూ ఎన్టీఆర్ యమదొంగ-అతన్ని ఫాలో అవ్వద్దంటూ ‘చిరు’కి సలహాలు....
చిరంజీవి ఇప్పటికే అమెరికా వెళ్ళి సన్నబడ్డారు. ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజుల పాటు అమెరికా వెళ్ళి మరికొంత కొవ్వు కరిగించుకొనేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఈ సారి ముఖానికి సంబంధించిన సర్జరీలు కూడా చేయించుకుని రానున్నారని సమాచారం. అయితే చిరు అభిమానులు మాత్రం మరీ జూ ఎన్టీఆర్ యమదొంగలోలా సన్నబడితే తాము చూడలేమని అన్నయ్య మరీ అంత సన్నబడితే బాగుండదని సలహా ఇస్తున్నారు.
ఇదిలా వుండగా చిరంజీవి అధినాయకుడు షూటింగ్ ప్రారంభమైనట్టు విశ్వసనీయ సమాచారం. అయితే చిరంజీవిపై ఇంకా చిత్రీకరణ ప్రారంభం కానప్పటికీ సైడ్ ట్రాక్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలిసింది. సినిమాకి సంబంధించిన ప్రతీ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. అంతే కాకుండా రెండు రకాలుగా క్లైమాక్స్ ను ప్లాన్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇటీవలే చిరంజీవి అమెరికా వెళ్ళి లైపోసక్షన్ ప్రక్రియ ద్వారా చాలా వరకు సన్నబడ్డాడని చిరంజీవి ఇప్పుడు బరువు తగ్గి మరల తన రీ ఎంట్రీకి అన్ని విధాలా రెడీ అయ్యాడని అతడ్ని చూస్తేనే తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకుడైతే హీరోయిన్ గా శ్రియ పేరు పరిశీలనలో ఉంది.


Click it and Unblock the Notifications